ISSF World Cup : ప్రతిష్ఠాత్మక ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్‌లో భారత యువ షూటర్ ఇషా సింగ్ (Esha Singh) సంచలనం సృష్టించింది. హంగ్జూ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఒలింపిక్ విజేత మనూ భాకర్ (Manu Bhaker)ను ఓడించి పసిడి పతకం కొల్లగొట్టిందీ హైదరాబాది. సోమవారం మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో మనూ కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచిన 21 ఏళ్ల ఇషా.. పోడియం మీద సగర్వంగా స్వర్ణ పతకం స్వీకరించింది. మెగా ఈవెంట్లో నిరాశపరిచిన మనూ భాకర్ కాంస్యంతో సరిపెట్టుకుంది.
షూటింగ్లో గొప్పగా రాణిస్తున్న ఇషా సింగ్ అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటింది. ఇటీవలే మ్యూనిచ్‌లో అదిరే ప్రదర్శనతో రికార్డు పుస్తకాల్లో చేరిన ఇషా ఈసారి చైనాలోని హంగ్జూ వేదికగా జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్‌కప్‌లో పసిడి వెలుగులు విరజిమ్మింది. మహిళల25 మీటర్ల పిస్టల్ విభాగంలో భారత్‌కే చెందిన ఒలింపిక్ విజేత మనూ భాకర్‌ను ఓడించి పసిడి పతకం గెలచుకుంది ఇషా.
Watch Esha Singh winning ISSF World Cup! pic.twitter.com/eoSdeLDjRu
— The Khel India (@TheKhelIndia) July 27, 2026
‘మ్యూనిచ్‌లో పతకం గెలిచినందున ఈ మ్యాచ్‌లో నాపై ఒత్తిడి ఎక్కువ ఉంది. ఇలాంటి సమయంలో మనలోని అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాల్సి వస్తుంది. ఇక్కడే రెండేళ్ల క్రితం ఆసియా క్రీడల్లో పాల్గొన్న అనుభవం.. నాలుగు మెడల్స్ సాధించిన జ్ఞాపకాలు నాకు మరింత బలమయ్యాయి’ అని ఇషా పేర్కొంది. త్వరలో జరుగనున్న వరల్డ్ ఛాంపియన్షిప్స్, ఆసియా క్రీడలకు ముందు గోల్డ్ మెడల్ సాధించడం ఇషా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయనుంది.
𝗗𝗢𝗨𝗕𝗟𝗘 𝗣𝗢𝗗𝗜𝗨𝗠 𝗙𝗢𝗥 𝗜𝗡𝗗𝗜𝗔 𝗔𝗧 𝗧𝗛𝗘 𝗜𝗦𝗦𝗙 𝗪𝗢𝗥𝗟𝗗 𝗖𝗨𝗣! 🤩🇮🇳
🥇 Esha Singh backs up her Munich triumph with a back-to-back World Cup gold medal, in the Women’s 25m Pistol. 😎
🥉 Manu Bhaker adds another international medal to her growing collection,… pic.twitter.com/lkCtEtNqle
— Royal Challengers Bengaluru (@RCBTweets) July 27, 2026