Tragedy | విషాదం.. ఏపీ సీఎంచే ప్రశంసలందుకున్న విద్యార్థిని ఆత్మహత్య
Tragedy | ఏపీ సీఎం చంద్రబాబు పక్కనే కూర్చుని తన లక్ష్యాన్ని వివరించిన విద్యార్థిని 48 గంటల్లో ఆత్మహత్య చేసుకోవడం విషాదం నింపింది.
అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu ) పక్కనే కూర్చుని తన లక్ష్యాన్ని వివరించిన విద్యార్థిని 48 గంటల్లో ఆత్మహత్య ( Suicide ) చేసుకోవడం విషాదం ( Tragedy ) నింపింది.ఈ ఘటనపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పోలవరం జిల్లా రంపచోడవరం మండలం ఇర్లపల్లిలో పదో తరగతి చదువుతున్న ముర్రం శివాని అనే విద్యార్థిని అమ్మమ్మ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది . అయితే ఆమె వద్ద సూసైడ్ నోట్ లభించినా కాని ఆత్మహత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. తాను ఏదైనా సాధించి చూపాలని ఉందని, కాని చాలా బాధను అనుభవిస్తున్నానని లేఖలో పేర్కొంది.
ఈనెల 24న రంపచోడవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ గ్రామంలో పర్యటించి తల్లికి వందనం కార్యక్రమంలో పాల్గొని ప్రతి విద్యార్థికి రూ.15 వేలు మెగా పీటీఎం ద్వారా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ముర్రం శివాని పాల్గొని తన కలలను వివరించింది. తాను కష్టపడి చదివి వచ్చే సంవత్సరానికి షైనింగ్ స్టార్ అవార్డును సొంతం చేసుకుంటానని వేదిక ద్వారా ప్రసంగించింది. అనంతరం ఆమెను చంద్రబాబు దగ్గరకు తీసుకుని ప్రశంసించారు.
ఇది జరిగిన రెండు రోజులకు విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది . ఈ ఘటనపై ఏపీ సీఎం స్పందిస్తూ విద్యార్థిని మృతి తనను కలిచివేస్తోందని ఎక్స్లో పోస్టు చేశారు. విద్యార్థిని మృతిపై పూర్తి దర్యాప్తు జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శివాని తండ్రి మురళీకృష్ణ హోటల్లో పనిచేస్తుండగా తల్లి సౌభాగ్యవతి గృహిణిగా ఉంది . పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

