Manish Sisodia | కోర్టు అనుమతితో.. భార్యను చూసేందుకు జైలు నుంచి ఇంటికి వెళ్లిన సిసోడియా
Manish Sisodia | ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో ( liquor policy case) అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా (Manish Sisodia) శనివారం జైలు నుంచి బయటకు వచ్చారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసేందుకు మధురా రోడ్డులోని నివాసానికి వెళ్లారు.
Manish Sisodia | ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల్లో ( liquor policy case) అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా (Manish Sisodia) శనివారం జైలు నుంచి బయటకు వచ్చారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసేందుకు మధురా రోడ్డులోని నివాసానికి వెళ్లారు. మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలు (Tihar Jail)లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సిసోడియా కోర్టు అనుమతితో శనివారం ఉదయం 10 గంటలకు ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ ఆయన తన భార్యతోనే ఉండనున్నారు.
కాగా, భార్య అనారోగ్యంతో ఉందని తనను కలుసుకునేందుకు అనుమతించాలంటూ సిసోడియా గతంలో కోర్టుకు విన్నవించుకున్న విషయం తెలిసిందే. తన భార్యను కలుసుకునేందుకు 5 రోజులపాటు అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సిసోడియాకు అనుమతి ఇచ్చింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఇంట్లో తన భార్యను కలిసేందుకు అనుమతిచ్చింది. అయితే, ఎలాంటి రాజకీయ సమావేశాలు, ప్రసంగాలు నిర్వహించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం సిసోడియా జైలు నుంచి ఇంటికి చేరుకున్నారు. సాయంత్రం తిరిగి జైలుకు వెళ్లిపోనున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంతో మనీష్ సిసోడియాకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఏడాదిన్నర క్రితం సీబీఐ, ఈడీ అధికారులు సిసోడియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లిక్కర్ స్కామ్ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండూ విచారిస్తున్నాయి. ఈ క్రమంలో మనీష్ సిసోడియాను రెండు దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులూ ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు అవినీతి, మనీలాండరింగ్ కేసుల్లో సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ( Supreme Court) నిరాకరించింది. గతంలో సిసోడియా దాఖలు చేసిన రెండు వేర్వేరు బెయిల్ దరఖాస్తులపై అక్టోబర్ 17న తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం.. అక్టోబర్ 30న తీర్పు వెలువరించింది. ఈ కేసుకు సంబంధించిన కొన్ని ఆధారాలను ఈడీ తమకు అందించినట్లు కోర్టు తెలిపింది. లిక్కర్ స్కామ్‌లో రూ.338 కోట్ల నగదు బదిలీకి సంబంధించి ఈడీ కొన్ని ఆధారాలను చూపించినట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఇక ఈ లిక్కర్ స్కామ్ కేసులో విచారణను పూర్తి చేసేందుకు ఈడీకి సుప్రీంకోర్టు 6 నుంచి 8 నెలల సమయం ఇచ్చింది. విచారణ నెమ్మదిగా సాగితే.. మూడు నెలల్లోపు సిసోడియా మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హత పొందుతారని సుప్రీం పేర్కొంది.
Also Read..
Chandramohan | కె.విశ్వనాథ్, ఎస్పీబాలుతో చంద్రమోహన్‌కు ఉన్న బంధుత్వం ఏంటో తెలుసా..?
Chandramohan | సంపాదించిన దాని కంటే పోగొట్టుకున్నదే ఎక్కువ.. చంద్రమోహన్ ఎమోషనల్ ఇంటర్వ్యూ
Chandramohan | చంద్రమోహన్ ఇన్నేండ్లు సినీ ఇండస్ట్రీలో దిగ్విజయంగా కొనసాగాడంటే.. దానికి కారణమదే!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

