వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్‌పై భారీగా సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కాస్త మెత్తబడినట్లు కనిపిస్తున్నది. త్వరలోనే తాను భారత్‌కు (India) వచ్చే అవకాశం ఉందని ప్రకటించారు. ప్రధాని మోదీపై (PM Modi) ప్రశంసలు కురిపించారు. మోదీ తనకు గొప్ప స్నేహితుడని, భారత్-అమెరికా వాణిజ్య సంబంధాల బలోపేతమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు.
ఓవల్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీతో వాణిజ్య చర్చలు చాలా బాగా జరుగుతున్నాయన్నారు. మోదీ రష్యా నుంచి చమురు కొనడం చాలావరకు మానేశారని చెప్పారు. ఆయన తనుకు గొప్ప స్నేహితుడని, మా మధ్య చర్చలు జరుగుతున్నాయి. తాను భారత్ రావాలని మోదీ కోరుకుంటున్నారని వెల్లడించారు. తాము దానిని పరిశీలిస్తున్నామని చెప్పారు. తాను వెళ్తానని, ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి అని చెప్పుకొచ్చారు. వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించాలని మీరు ప్లాన్ చేస్తున్నారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా, ‘అవును. అలాగే కావొచ్చు’ అని ట్రంప్ అన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.