చరిత్రలో ఈరోజు.. విమాన ప్రమాదంలో భారత అణుపితామహుడు మృతి

భారత అణు పితామహుడిగా చెప్పుకొనే ప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్ హోమీ జహంగీర్ భాభా.. 1966 లో సరిగ్గా ఇదేరోజున జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారు. అప్పటికి ఆయన వయసు 56 ఏండ్లే. ముంబై నుంచి అమెరికాలోని న్యూయార్క్‌కు వెళ్తున్న విమానం.. యూరప్‌లోని ఆల్ప్స్ పర్వత శ్రేణిలో ప్రమాదానికి గురై కుప్పుకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న హోమీ భాభాతోపాటు 117 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై ఇంతవరకు సమాచారం లేకపోవడం విశేషం.
ముంబైకి చెందిన ప్రసిద్ధ న్యాయవాది జహంగీర్ హోర్ముస్జీ భాభా, మెహ్రెన్ దంపతులకు 1909 అక్టోబర్ 30 న హోమీ జహంగీర్ భాభా జన్మించారు. ప్రాథమిక విద్యను ముంబైలో చదివిన భాభా.. 15 వ ఏటనే సీనియర్ కేంబ్రిడ్జి హానర్స్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. గణితంలో మాస్టర్ కోర్సు చేసిన భాభా ఒక్కసారిగా తన మనసును న్యూక్లియార్ ఫిజిక్స్ వైపు మరల్చి 1930 లో న్యూక్లియార్ ఫిజిక్స్‌లో డాక్టరేట్ అందుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇండియాకు వచ్చిన భాభా.. తిరిగి ఇంగ్లండ్ వెళ్లకూడదని నిర్ణయించుకుని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో సీవీ రామన్ ఆధ్వర్యంలో నడుస్తున్న భౌతికశాస్త్రం విభాగంలో రీడర్‌గా చేరారు. ఈ సమయంలో సర్ దోరబ్ టాటా ట్రస్ట్ ఇచ్చే స్కాలర్షిప్కు ఎంపికవడం భాభా జీవితాన్నే మార్చేసింది. 1941 లో జేఆర్డీ టాటా సహకారంతో రాయల్ సొసైటీ ఫెల్లోషిప్ అందుకున్నారు. అనంతరం మహారాష్ట్రలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ స్థాపించి పలు అంశాలపై పరిశోధనలు జరిపారు.
ట్రోంబేలోని భాభా అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన గౌరవార్థం దీనికి భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అని పేరు పెట్టారు. భాతర్‌లో అణ్వాయుధాల అభివృద్ధికి మూలస్తంభంగా చెప్పుకునే టీఐఎఫ్ఆర్, అఈఈటీ లను భాభా డైరెక్టర్‌గా పర్యవేక్షించారు. భాభా చేసిన సేవలకు గాను ఆడమ్స్ ప్రైజ్ (1942), కేంద్ర ప్రభుత్వంచే పద్మభూషణ్ (1954) లభించింది. 1951, 1953-1956లో భౌతికశాస్త్రం విభాగంలో నోబెల్ బహుమతికి ఎంపికయ్యాడు. న్యూయార్క్‌కు బయల్దేరడానికి మూడు నెలల ముందు భాభా చేసిన ప్రకటన సంచలనం రేపింది. తనకు అనుమతిస్తే కేవలం 18 నెలల్లోనే ఆటంబాంబును తయారుచేసి చూపిస్తాను అని ప్రకటించారు. సమన్వయ లోపం కారణంగా విమానం దింపడంలో ఇబ్బందులు తలెత్తినందున విమానం కూలిపోయినట్లుగా భావిస్తున్నారు. అయితే, అణు బాంబు తయారుచేస్తే తమకు ముప్పుగా పరిణమిస్తారన్న భయంతో భాభా ప్రయాణిస్తున్న విమానాన్ని అమెరికాకు చెందిన సీఐఏ అధికారులు కూల్చివేయించారన్న ఆరోపణలు కూడా వచ్చాయి.
మరికొన్ని ముఖ్య సంఘటనలు:
2011: భారతరత్న, హిందూస్థానీ శాస్త్రీయ సంగీత గాయకుడు పండిట్ భీమ్సేన్ జోషి మరణం
2004: మార్స్ మీద 2003 లో ల్యాండైన రోబోటిక్ రోవర్ ఆపర్చునిటీ
1984: ఆపిల్, స్టీవ్ జాబ్స్ సంస్థ, మాకింతోష్ కంప్యూటర్ మార్కెట్ ప్రారంభం
1965: రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ ప్రధాని విస్టన్ చర్చిల్ 90 సంవత్సరాల వయసులో మరణం
1961: తన మూడవ భర్త ఆర్థర్ మిల్లర్‌కు విడాకులు ఇచ్చిన హాలీవుడ్ స్టార్ మార్లిన్ మన్రో
1951: వాణిజ్య లైసెన్స్ పొందిన మొదటి మహిళా పైలట్‌గా ప్రేమ్ మాథుర్ రికార్డు
1950: దేశ జాతీయ గీతంగా అంగీకరించబడిన 'జన గణ మన'
1945: హిందీ చిత్రాల నిర్మాత, దర్శకుడు సుభాష్ ఘాయ్ జననం
1924: లాలూ, పాశ్వాన్ల గురువు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ జననం
1857: కలకత్తా విశ్వవిద్యాలయం స్థాపన
1556: చైనాలోని షెన్సీ ప్రావిన్స్‌లో సంభవించిన భూకంపం. 8.30 లక్షల మంది మరణం
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఒకే స్కూళ్లో 190 మంది విద్యార్థులకు కరోనా
- ఆర్ఎస్ఎస్ కార్యకర్త హత్య.. కేరళలో బంద్
- నగ్నంగా ఉన్న ఫొటో అడిగిన నెటిజన్.. షేర్ చేసిన శ్రీముఖి
- మణిపూర్‌లో స్వల్ప భూకంపం
- ఆందోళన కలిగిస్తున్న కరోనా.. దేశంలో పెరుగుతున్న కేసులు
- మహిళ గుండెతో కూర.. దంపతులకు వడ్డించి హత్య
- ఢిల్లీలో పెరిగిన కాలుష్యం
- పవన్ కళ్యాణ్‌తో బిగ్ బాస్ బ్యూటీ సెల్ఫీ.. పిక్స్ వైరల్
- ఎన్టీపీసీలో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాలు
- దుబాయ్‌లో బన్నీ ఫ్యామిలీ హల్చల్