Australia Prime Minister | 62 ఏళ్లకు రెండో పెళ్లి.. ఆస్ట్రేలియా ప్రధాని వీడియో వైరల్..!
Australia Prime Minister : ఆస్ట్రేలియా ప్రధాని అంథోనీ అల్బనీస్ (Anthony Albanese) రెండోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 62 ఏళ్ల వయసున్న ఆయన కాన్‌బెర్రాలోని అధికారిక నివాసంలో తన భాగస్వామి జోడీ హేడొన్ (Jodie Haydon)ను మనువాడారు.
Australia Prime Minister : ఆస్ట్రేలియా ప్రధాని అంథోనీ అల్బనీస్ (Anthony Albanese) రెండోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 62 ఏళ్ల వయసున్న ఆయన కాన్‌బెర్రాలోని అధికారిక నివాసంలో తన భాగస్వామి జోడీ హేడొన్(Jodie Haydon)ను మనువాడారు. తద్వారా ప్రధాని హోదాలో పెళ్లి చేసుకున్న తొలి వ్యక్తిగా అంథోని రికార్డు నెలకొల్పారు. తన స్నేహితురాలైన హేడోన్ను నవంబర్ 29న శనివారం పెళ్లి చేసుకున్న ఆసీస్ ప్రధాని ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నారు.
ఆంథోని, హెడోన్లు ఐదేళ్ల క్రితం మెల్బోర్న్లో ఒక పబ్లిక్ ఫంక్షన్లో తారసపడ్డారు. ఆ తర్వాత నుంచి ఇద్దరూ స్నేహితులుగా మెలిగారు. అయితే.. హెడోన్పై ఆంథోనికి ప్రేమ పుట్టింది. దాంతో.. ఆలస్యం చేయకుండా 2024లో ప్రేమికుల రోజున తన మనసులోని మాటలను ఆమెతో చెప్పేశారు. అదే రోజు.. నిశ్చితార్ధం ఉంగురాన్ని కూడా ఆమె చేతికి తొడిగారు. అప్పటి నుంచి ప్రధానితో పాటు హెడోన్ కూడా పలు కార్యక్రమాలకు హాజరయ్యేది. ఆంథోనీ.. 2022 మేలో ఆస్ట్రేలియా 31వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
Married💍❤️💍 pic.twitter.com/mSzojtBF2I
— Anthony Albanese (@AlboMP) November 29, 2025
గార్డియన్ మీడియా కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం లాడ్జ్‌లో ఆంటోనీ, జోడీల పరిణయ వేడుక అట్టహాసంగా జరిగింది. పెళ్లి తర్వాత భార్యతో కలిసి నడిచి వస్తున్న వీడియోను ఆసీస్ ప్రధాని ఎక్స్ వేదికగా అందరితో పంచుకున్నారు. దంపతులు ఇద్దరూ అమెరికా సింగర్ పాట సంతకం చేశాను. ‘ఒప్పందం కుదిరింది. నేను నీ సొంతం’ అనే పదాలను ఉచ్చరించారు.
మొదటి భార్య కార్మెల్ టెబుట్తో ఆంథోనీ

అనంతరం.. అమెరికా గాయకుడు ఫ్రాంక్ సింట్రాస్ పాపులర్ సాంగ్ ‘ది వే యూ లుక్ టునైట్’ (The Way You Look Tonight) అనే పాటకు హుషారుగా డ్యాన్స్ చేశారు. ప్రధాని ఆంథోని వివాహానికి ఇరువురి కుటుంబసభ్యులు, దగ్గరి స్నేహితులు.. అల్బేనీస్ కుమారుడు నాథన్, హేడొన్స్ తల్లిదండ్రులు బిల్, పౌలిన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, ఆర్థిక మంత్రి కేటీ గల్లాగెర్, ఏఎల్పీ జాతీయ కార్యదర్శి పాల్ ఎరిక్సన్, ప్రధాన మంత్రి ఛీఫ్ ఆఫ్ స్టాప్ టిమ్ గార్ట్రెల్, తదితరులు పాల్గొన్నారు. ఆంథోని మొదటి కార్మెల్ టెబుట్ (Carmel Tebbutt )ను పెళ్లి చేసుకున్నారు. అయితే.. 20 ఏళ్ల తర్వాత అంటే.. 2019లో పరస్పర అంగీకారంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

