ఆటో షో అదరహో..
మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఆటో షో విజయవంతమైంది. జిల్లా కేంద్రంలోని బాయ్స్ కాలేజ్ గ్రాండ్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. బైకులు, కార్లు కొనాలనుకునే వారి ఆవసరాలను గుర్తించి ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలకు చెందిన వాహనాలను వాటి డీలర్లు ఒకే వేదికపైకి తీసుకొచ్చారు.
- ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆటో ఎక్స్పో విజయవంతం
- మహబూబ్‌నగర్‌లో గ్రాండ్ సక్సెస్
- రెండ్రోజులు కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన
- స్టాళ్లను సందర్శించి టెస్ట్‌డ్రైవ్ చేసి సంతోషం
- కిటకిటలాడిన బాలుర కళాశాల మైదానం
- వాహనాలు కొనుగోలు చేసిన వినియోగదారులు
- షో బాగుందని ‘నమస్తే’కు కృతజ్ఞతలు
- బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే యెన్నం
మహబూబ్‌నగర్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/మహబూబ్‌నగర్, నవంబర్ 30 : మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఆటో షో విజయవంతమైంది. జిల్లా కేంద్రంలోని బాయ్స్ కాలేజ్ గ్రాండ్లో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. బైకులు, కార్లు కొనాలనుకునే వారి ఆవసరాలను గుర్తించి ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలకు చెందిన వాహనాలను వాటి డీలర్లు ఒకే వేదికపైకి తీసుకొచ్చారు. ప్రదర్శనకు విచ్చేసిన ప్రజలు వివిధ కంపెనీల కార్లు, బైక్ మోడళ్ల వివరాలను తెలుసుకొన్నారు. టెస్ట్ డ్రైవ్ చేసి వారి మనసుకు నచ్చిన కార్లు, ద్విచక్రవాహనాలు కొనుగోలు చేశారు. చివరి రోజు సెలవు రోజు కావడంతో వందలాది మంది ఆటోషోకు పోటెత్తడంతో బాలుర కళాశాల మైదానం కిక్కిరిసిపోయింది. వివిధ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి కొత్త కొత్త ఫీచర్ల వాహనాలను అడిగి తెలుసుకున్నారు. బైకులు, కార్లను టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేక అనుభూతిని చెందారు.
వివిధ కంపెనీల ప్రతినిధులు, బ్యాంక్ సిబ్బంది, ప్లాట్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంస్థలు సైతం షోలో భాగస్వామ్యం అయ్యా యి. ఇది పట్టణ ప్రజలతోపాటు జిల్లావాసులకు ప్రయోజనకరంగా మారింది. ప్రదర్శనకు వచ్చిన వారికి నిర్వాహకులు లక్కీడిప్ సైతం నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించి ఉత్తేజపరిచారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్‌గౌడ్, డీసీసీ కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, దవాఖాన డెవలప్మెంట్ కమిటీ సభ్యుడు రాఘవేందర్ తదితరులు హాజరయ్యారు.

ఆటోషో అభినందనీయం : ఎమ్మెల్యే
పాలమూరు జిల్లాలో ఇలాంటి ఆటో ఎక్స్‌పోలు ఏర్పాటు చేయడం అభినందనియమనీ ఎమ్మె ల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో రెండ్రోజులుగా సాగుతున్న ఆటోషోను ఎమ్మెల్యే సందర్శించి మాట్లాడారు. ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ తరఫున అన్ని రకాల వాహనాలు ఒకే చోట ఏర్పాటు చేయడంతో వినియోగదారులకు ఎంతో వెసులుబాటు కలుగుతుందన్నారు. అన్ని కంపెనీలు ఒకే ప్లాట్‌ఫాంపై తీసుకురావడం, భవిష్యత్తులో ఇలాంటి వాటిని ప్రోత్సహించి కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
ఆ తర్వాత స్టాళ్లు ఏర్పాటు చేసిన వివిధ కంపెనీలకు మెమొంటోలు బహూకరించారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వినియోగదారులకు గిఫ్ట్‌లు అందజేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, డీసీసీ కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, దవాఖాన డెవలప్మెంట్ కమిటీ మెంబర్ రాఘవేందర్, ‘నమస్తే తెలంగాణ’ బీఎం మహేందర్, బ్యూరో ఇన్చార్జి వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేనేజర్ విజయ్ కుమార్, సర్క్యులేషన్ ఇన్చార్జి ఆనంద్, అసిస్టెంట్ మేనేజర్ రవికిషోర్, ఫొటోగ్రాఫర్ గోపీ, రిపోర్టర్ సతీష్, నవత యాడ్స్ ప్రకాశ్, రాహుల్ యాడ్స్ వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రెండో రోజు వాహనాల కొనుగోలు
జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆటోషోలో రెండో రోజు కస్టమర్లు భారీగా వాహనాలను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వారికి ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రత్యేక బహుమతులు అందజేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఈ ఆటోషోకు వచ్చిన కస్టమర్లు అన్ని కంపెనీల వాహనాలను ఒకే చోట చూసి వాటి గురించి తెలుసుకోవడానికి ఉత్సాహం ప్రదర్శించారు. ఇక్కడ సందర్శించిన కస్టమర్లకు ‘నమస్తే తెలంగాణ’ తరఫున గిఫ్ట్ కూపన్లు అందజేశారు. విజిటర్ల గిఫ్ట్ కూపన్లను డ్రా తీయగా మహబూబ్‌నగర్ పట్టణంలోని రాజేంద్రనగర్‌కు చెందిన వెంకటేశ్వర్లు విజేతగా నిలిచారు.

ఒకే వేదిక కల్పించడం అద్భుతం
‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ఆటో షో గురించి చూసి ప్రదర్శనలను తిలకించేందుకు వచ్చాం. ఇక్కడ ఇన్ని స్టాళ్లను చూసి ఆశ్చర్యానికి గురయ్యాం. అన్ని కంపెనీలు ఒకే చోట ప్రదర్శనలు ఇవ్వడం వల్ల కస్టమర్లకు ఆలోచించుకొని వాహనాలను కొనుగోలు చేసే సమయం ఉంటుంది. స్కూటీ తీసుకుందామని వచ్చాం. నిర్వాహకులు ఏర్పాట్లు బాగా చేశారు. ఇలాంటి కార్యక్రమలు నిర్వహించడం సంతోషంగా ఉంది.
– కే.దీప్తి, టీచర్స్‌కాలనీ, మహబూబ్‌నగర్
ప్రదర్శన ఎంతో ప్రయోజనకరం..
కార్లు, బైక్‌లు కొనాలనుకునే వారి ఆవసరాలను గుర్తించి ప్రముఖ కంపెనీలకు చెందిన వాహనాలను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయం. ముందుగా స్టాళ్లను సందర్శించి, వివిధ కంపెనీల కార్లు, బైక్ మోడళ్ల వివరాలను తెలుసుకొని టెస్ట్ డ్రైవ్ చేశాం. నమస్తే తెలంగాణ సిబ్బంది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. లోన్లు తీసుకునేందుకు కూడా బ్యాంక్ వారు ఉన్నారు.
– డీ.రాజేశ్, మహబూబ్‌నగర్
తక్కువ ధరలో సిట్రాన్ ప్రైడ్ మోటర్స్ కార్లు
ప్రీమియం సెగ్మెంట్లో వాహనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎక్కువ మంది కస్టమర్లు వీక్షించి వివరాలు తెలుసుకున్నారు. అందుబాటు ధరల్లో ఉన్నాయి. సిట్రాయన్ సీ 3ఎక్స్ కార్లపై ఫోర్ వీల్ వాహనాల గుర్తింపు ఉంది. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆటో షో ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు మంచి ఆవకాశం కల్పించారు. నిర్వాహకులు, వినియెగదారులకు కృతజ్ఞ్ఞతలు.
– విశ్వానంద్, సిట్రాయన్ కార్ ఫ్రైడ్ మోటర్స్, హైదరాబాద్
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

