హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు ప్రతిష్ఠాత్మక గ్రీన్ఇండియా ఆరిటెక్ట్ పురసారం దకింది. దేశంలో 19 కోట్లకు పైగా మొకలు నాటి, వాటిని సంరక్షించేందుకు గొప్ప ప్రేరణగా నిలిచినందుకు గాను ఆయనకు ఈ అవార్డు వరించింది. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కాంపాక్ట్ నెట్వర్ ఇండియా, ఇండస్ట్రియల్ అవుట్‌లుక్ మ్యాగజైన్, ఈపీఎస్ ఎనర్జీ ఎక్స్పో సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 29న పుణెలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ అవార్డుతోపాటు పురస్కారాన్ని ఆయన తరఫున కరుణాకర్‌రెడ్డికి అందజేశారు.
‘హరా హైతో భరా హై’ ‘గ్రీన్ ఇండియా ఫర్ ఏ గ్రేట్ ఇండియా’ వంటి నినాదాల స్ఫూర్తిని నిజంచేసేలా సంతోష్ చేసిన పర్యావరణ నిర్మాణాత్మక సేవలను, సంరక్షణ కార్యక్రమాలను అవార్డీకి ఇచ్చిన ప్రశంసాపత్రంలో కొనియాడారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ దేశవ్యాప్తంగా ఓ ప్రజా ఉద్యమంగా మారిందని ఈపీఎస్ ప్రతినిధులు ప్రశంసించారు. పర్యావరణ సంరక్షణ కోసం ప్రేరణగా నిలిచి పట్టణాల్లో అటవీ ప్రాంతాల అభివృద్ధికి దోహదపడిందని తెలిపారు. సంతోష్ నేతృత్వంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా ‘మాస్ ప్లాంటేషన్ డ్రైవ్స్’, ‘వాక్ ఫర్ వాటర్’, ‘లివబుల్ ప్లానెట్’ వంటి పర్యావరణ, నీటి సంరక్షణ, సుస్థిరాభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. స్వచ్ఛమైన హరిత సమాజం రూపుదిద్దుకునేలా గ్రీన్ ఇండియా చాలెంజ్ దోహదపడుతున్నదని కొనియాడారు.