Hindu Man | పొరుగుదేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో మరో హిందూ వ్యక్తి (Hindu Man) ప్రాణాలు కోల్పోయారు. మూడు రోజుల క్రితం మూకదాడిలో తీవ్రంగా గాయపడిన 50 ఏండ్ల ఖోకోన్ దాస్ (Khokon Das) మృతి చెందారు.
డిసెంబర్ 31న దేశంలోని షరియత్పూర్ (Shariatpur) జిల్లాలో మందుల దుకాణం యజమాని అయిన దాస్ ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు దాడి చేశారు. కత్తులతో పొడిచి దారుణంగా కొట్టారు. అంతటితో ఆగకుండా పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దాడి నుంచి దాస్ తప్పించుకుని సమీపంలోని నీటి కంటలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. అయితే, ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన దాస్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా ప్రాణాలు విడిచాడు.
Also Read..
Venezuela | భారీ పేలుళ్లతో దద్దరిల్లిన వెనెజువెలా.. వీధుల్లోకి పరుగులు తీసిన జనం
Brazil Road Accident | బ్రెజిల్లో లారీ, బస్సు ఢీ.. 11 మంది మృతి
Mexico Earthquake | ప్రెస్మీట్ మధ్యలో భూకంపం.. ప్రసంగం ఆపి బయటకు వచ్చేసిన మెక్సికో అధ్యక్షురాలు