Hindu Man | మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ (Bangladesh)లో హిందువులపై దాడులు ఆగడం లేదు (Attacked By Mob). తాజాగా మరో హిందూ వ్యక్తి (Hindu worker)పై మూక దాడి జరిగింది. ఈ దాడిలో సదరు వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానిక మీడియా వివరాల ప్రకారం.. డిసెంబర్ 31న దేశంలోని షరియత్‌పూర్ (Shariatpur) జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. 50 ఏండ్ల వ్యక్తి ఖోకోన్ దాస్ (Khokon Das)పై ఓ బృందం దాడి చేసింది. పదునైన ఆయుధాలతో గాయపరిచింది. అనంతరం నిప్పటించింది. ఈ దాడిలో ఖోకోన్ దాస్ తీవ్రంగా గాయపడ్డాడు. కాగా, బంగ్లాదేశ్‌లో హిందూ వ్యక్తిపై దాడి జరగడం నెల రోజుల వ్యవధిలో ఇది నాలుగో ఘటన.
డిసెంబర్ 24న బంగ్లాదేశ్‌లోని కలిమోహర్ యూనియన్‌లోని హోస్సైన్‌డంగా ప్రాంతంలో 29 ఏండ్ల అమృత్ మండల్ అనే వ్యక్తిని ఓ గుంపు కొట్టి చంపిన విషయం తెలిసిందే. అంతకుముందు అంటే డిసెంబర్ 18వ తేదీన భాలుకాలో హిందూ వ్యక్తి దీపు చంద్ర దాస్‌ను ఓ గుంపు కొట్టి చంపింది. డిసెంబర్ 30న కూడా మైమెన్సింగ్ జిల్లాలోని ఓ వస్త్ర కర్మాగారంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న హిందూ కార్మికుడిని సహోద్యోగి (colleague) కాల్చి చంపాడు. ఇలా వరుస దాడులతో బంగ్లాదేశ్‌లోని హిందువుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read..
Drone Strike | న్యూఇయర్ పార్టీపై డ్రోన్ దాడి.. 24 మంది మృతి
Explosion | న్యూఇయర్ పార్టీలో తీవ్ర విషాదం.. బార్లో మంటలు చెలరేగి 40 మంది మృతి
Telugu Student | న్యూఇయర్ వేళ విషాదం.. జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి