Flash Floods | అమెరికాలోని న్యూయార్క్ (New York), న్యూజెర్సీ (New Jersey) నగరాలకు వరదలు (Floods) ముంచెత్తాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాల (Heavy Rains) కారణంగా ఆకస్మిక వరదలు (Flash Floods) సంభవించాయి. ఈ వరదలకు అనేక ఇళ్లు నీట మునిగాయి. ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. రవాణా ఆగిపోయింది. ఈ ప్రభావం విమానాల రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం పడింది.
భారీ వర్షాలు, ఆకస్మిక వరదల నేపథ్యంలో న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, అధిక వర్షపాతం కారణంగా అత్యవసర పరిస్థితి ప్రకటిస్తున్నట్లు తెలిపారు. నివాసితులు ఇళ్లలోనే ఉండాలని, అనవసర ప్రయాణాలను పెట్టుకోవద్దని ప్రజలకు సూచించారు.
I am declaring a State of Emergency given flash flooding and high levels of rainfall in parts of the state.
Please stay indoors and avoid unnecessary travel. Stay safe, New Jersey.
— Governor Phil Murphy (@GovMurphy) July 14, 2025
మరోవైపు న్యూయార్క్ సిటీలోని మన్హటన్, బ్రూక్లిన్, క్వీన్స్, స్టేటెన్ ఐలాండ్ ప్రాంతాలకు నేషనల్ వెదర్ సర్వీస్ ఆకస్మిక వరద హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు న్యూయార్క్ సిటీ మెట్రో వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. సబ్‌వేల్లోకి వరద పోటెత్తింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో అనేకమంది నివాసితులు అంధకారంలో ఉండిపోయారు. పలు ప్రాంతాలను వరదలు చుటుముట్టడంతో వేలాది మంది నివాసితులు జలదిగ్భందంలో చిక్కుకుపోయారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపాయి. వరదలు, వర్షాల కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
I’ve never seen flooding like this in Jersey. New Providence, NJ pic.twitter.com/kIe6OJ9Y7j
— Kyle (@kczar18) July 14, 2025
BREAKING: State Of Emergency declared for parts of New Jersey amid ongoing flash flooding, governor says. Video from New Jersey Turnpike:
— AZ Intel (@AZ_Intel_) July 14, 2025
Also Read..
X Down | ఎక్స్ సేవల్లో మళ్లీ అంతరాయం.. ప్రపంచ వ్యాప్తంగా లాగిన్‌లో సమస్యలు
Shubhanshu Shukla: అంతరిక్షంలో హెయిర్ కటింగ్ చేయించుకున్న శుభాన్షు శుక్లా
GE-404 engine | అమెరికా నుంచి భారత్‌కు మరో GE-404 ఇంజిన్.. త్వరలో మరికొన్ని..!