X Down | అమెరికన్ టైకూన్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ఆధీనంలోని ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ (ఎక్స్) ఇటీవలే మాటిమాటికీ సతాయిస్తోంది. ఏదో ఒక సమస్యతో యూజర్లను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇటీవలే ట్విట్టర్ సేవల్లో అంతరాయం ఏర్పడటం.. లాగిన్ కాకపోవడం, ట్వీట్స్ మాయం కావడం వంటి సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఎక్స్‌లో ఇలాంటి సమస్యే తలెత్తింది (X Down).
సాంకేతిక సమస్యల కారణంగా భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా ‘ఎక్స్’ సర్వర్ డౌన్ (X suffers brief outage) అయ్యింది. ఎక్స్ అకౌంట్ లాగిన్ అవ్వట్లేదు. యూజర్‌నేమ్ ఎంటర్ చేసి నెక్ట్స్ ఆప్షన్‌పై క్లిక్ చేయగానే ఎర్రర్ అని చూపిస్తోంది (users are unable to login). ఈ విషయాన్ని డౌన్ డిటెక్టర్ వెబ్సైట్ కూడా ధృవీకరించింది. భారత్‌లో ఇవాళ ఉదయం 8 గంటల నుంచే ఈ సమస్య తలెత్తినట్లు డౌన్ డిటెక్టర్ వెల్లడించింది. దీంతో యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు. దాదాపు 76 శాతం మంది వినియోగదారులు లాగిన్ అవ్వడంలో సమస్యలను ఎదుర్కొంటుండగా.. 24 శాతం మంది వెబ్‌సైట్‌తో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు డౌన్‌డిటెక్టర్ నివేదించింది.
Also Read..
Tesla | భారత్‌లో టెస్లా తొలి షోరూం ప్రారంభం
Jaishankar: చైనా అధ్యక్షుడిని కలిసిన విదేశాంగ మంత్రి జైశంకర్