Hamas | టెల్ అవీవ్, మే 28: హమాస్‌కు చెందిన మరో అగ్రనేతను ఇజ్రాయెల్ హతమార్చింది. ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో గాజా హమాస్ చీఫ్ మహ్మద్ సిన్వార్ మరణించాడు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ఈ విషయాన్ని నిర్ధారించారు. గతంలో ఇజ్రాయెల్ దళాల చేతిలో హతమైన యహ్యా సిన్వార్ తమ్ముడే ఈ మహ్మద్ సిన్వార్.
కాగా, తాము జరిపిన దాడుల్లో మహ్మద్ సిన్వార్ మృతి చెంది ఉండవచ్చునని ఇజ్రాయెల్ కొద్ది రోజుల క్రితమే పేర్కొంది. దక్షిణ గాజాలోని యూరోపియన్ హాస్పిటల్ భూగర్భ కమాండ్ కాంపౌండ్ కింద సిన్వార్ దాగి ఉన్నారన్న సమాచారం మేరకు ఇజ్రాయెల్ దళాలు దాడులు జరిపాయి. ఈ దాడిలో మహ్మద్ సిన్వార్‌తో పాటు హమాస్ రఫా బ్రిగేడ్ కమాండర్ మహమ్మద్ షబానా కూడా మరణించాడు. 2024 అక్టోబర్‌లో యహ్యా సిన్వార్ మృతి చెందిన తర్వాత మహ్మద్ సిన్వార్ హమాస్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు.