జెరూసలేం, అక్టోబర్ 29 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంలో హమాస్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించింది. బుధవారం గాజాపై వైమానిక దాడులకు దిగింది. దీంతో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని, మృతుల్లో 35 మంది చిన్నారులు ఉన్నారని గాజా అధికారిక వర్గాలు తెలిపాయి. గాజా సివిల్ డిఫెన్స్ అధికార ప్రతినిధి మహమూద్ బస్సాల్ మాట్లాడుతూ, ‘కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీవ్రస్థాయిలో ఇజ్రాయెల్ ఉల్లంఘించింది.
వైమానిక దాడుల కారణంగా గాజాలో అత్యంత దయనీయ, భయానక పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం 12 గంటల్లో 101 మంది ప్రాణాల్ని ఇజ్రాయెల్ బలితీసుకుంది’ అని అన్నారు. దీనిపై ఇజ్రాయెల్ రక్షణమంత్రి స్పందిస్తూ, ‘ఇజ్రాయెల్ సైనికులపై హమాస్ దాడి చేసింది. దాంతో శక్తివంతమైన దాడులతో సమాధానమిచ్చాం’ అని అన్నారు.