Abd al-Hadi Sabah | ఇజ్రాయెల్ – హమాస్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. తాజాగా అక్టోబర్ 7 నాటి దాడుల కీలక సూత్రధారి అబ్దల్ హదీ సబాను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఖాన్ యూనిస్‌లోని మానవతా సాయం పొందుతున్న అబ్దల్ హదీ.. ఇటీవల జరిపిన డ్రోన్ దాడుల్లో మృతి చెందినట్లు తెలిపింది. అబ్దల్ అనేక ఉగ్రవాద దాడులకు నాయకత్వం వహించారని, అక్టోబర్ 7 నాటి దాడులకు కారకులైన వారిని తుద ముట్టించేందుకు తమ ఆపరేషన్ కొనసాగుతోందని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది.
గతేడాది జనవరిలో హమాస్ నాయకుడు సలేహ్ అరౌరీని తామే హతమార్చామని ఇజ్రాయెల్ ధ్రువీకరించింది. లెబనాన్‌పై జరిగిన దాడుల్లో హమాస్ డిప్యూటీ పొలిటికల్ హెడ్, మిలిటెంట్ వింగ్ వ్యవస్థాపకులు అరౌరీతో సహా మరో ఐదుగురు హతమయ్యారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి పాల్పడడంతో సుమారు 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 251 మందిని బంధించి గాజాకి తీసుకెళ్లింది. ఇంకా 97 మంది హమాస్ చెరలోనే ఉన్నారు. పలు ఘటనల్లో మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. హమాస్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 45,541 మంది మృతి చెందారు. 1,08,338 మందికి గాయాలయ్యాయని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
Harvard University | రోజులో పదిన్నర గంటలకుపైగా కూర్చొంటే మరణ ముప్పు!
Antarctica | అంటార్కిటికాపై రష్యా కన్ను.. మంచు ఖండంలో అపార చమురు నిక్షేపాలు
AP News | ఫుల్లుగా తాగి కరెంటు తీగలపై పడుకున్న మందుబాబు.. 31st దావత్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే!