టెహ్రాన్: హొర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో గుజరాత్‌కు వస్తున్న నౌకసహా రెండు నౌకలను ఇరాన్ బుధవారం స్వాధీనం చేసుకుంది. ఈ రెండు నౌకలు ఐఆర్జీసీ ఆధీనంలో ఉన్నాయని, వాటిని ఇరాన్‌కు మళ్లించడం జరిగిందని ఇరానియన్ ప్రభుత్వ టెలివిజన్ తెలిపింది. ఈ రెండు నౌకలను ఎంఎంసీ ఫ్రాన్సెస్కా, ఎపామినోండస్గా గుర్తించారు.
లైబీరియా జెండాతో ఉన్న ఎపామినోండస్ కంటెయినర్ నౌక గుజరాత్‌లోని ముంద్రా రేవుకు వెళుతున్నది. ఆ నౌక నిలిచిపోయినట్లు దాని నౌకాయాన స్థితి తెలియచేస్తున్నది. ట్రంప్ ప్రభుత్వంతో తదుపరి విడత చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో ఇరాన్ నాయకత్వం కఠిన వైఖరిని అవలంబిస్తున్నట్లు నౌకల స్వాధీనం సూచిస్తున్నది.