Google | ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం నుంచి గూగుల్ వెబ్‌సైట్‌తో పాటు జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్స్ సైతం పనిచేయడం లేదంటూ యూజర్లు ట్వీట్ చేశారు. భారత కాలమాన ప్రకారం ఉదయం 7 గంటల సమయంలో సేవలు స్తంభించాయి. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది సేవల్లో అంతరాయంపై ఫిర్యాదు చేసినట్లు అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ Downdetector.com పేర్కొంది. యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్‌తో పాటు చాలా దేశాల్లో వినియోగదారులు గూగుల్ సేవలు స్తంభించడంతో ఇబ్బందులకు గురయ్యారు.
trying to revive internet explorer with google being down pic.twitter.com/zujf1vNbpr
— mou ☘️🌐 (@pxresouls) August 9, 2022
గూగుల్‌లో సెర్చ్ చేసే సమయంలో గూగుల్ సర్వర్‌లో 502 ఎర్రర్ డిస్ప్లే అవుతున్నది. తాత్కాలికంగా ఆగిపోవడంతో పాటు ప్లీజ్ ట్రై ఎగైన్ ఇన్ 30 సెకెండ్స్.. అని చూపుతుందని, వెంటనే సమస్యను పరిష్కరించాలంటూ పలువురు యూజర్లు ట్వీట్లు చేశారు. మరికొందరు మీమ్స్‌ను ట్వీట్ చేశారు. గూగుల్ డౌన్ అవడంతో ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఒక బొమ్మ గుండెను నొక్కుతున్న వీడియోను పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నది. మరోవైపు ‘గూగూల్ డౌన్’ హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నది. అయితే, అంతరాయంపై గూగుల్ అధికారికంగా స్పందించలేదు.
Is @Google really down right now?!? Or is this just a me problem? #googledown pic.twitter.com/jgWWQwjkO2
— Presley Mullinax (@PresleyMullinax) August 9, 2022
Me omw to twitter to check if google is down for anyone else since I cant google search it #googledown pic.twitter.com/g797tcAv1q
— Ur mom (@bigfatBUSSY6) August 9, 2022
Me switching to twitter after experiencing error 500 in google#Google #googledown pic.twitter.com/hu4TMsB2K5
— 1038 (@remier_acbang) August 9, 2022