14 గంటల్లో వంద కిలోమీటర్లు పరుగెత్తి.. ఓ బంతి వేసేందుకు ఇంగ్లండ్ వ్యక్తి రికార్డు పరుగు
క్రికెట్లో షోయబ్ అక్తర్, బ్రెట్ లీ వంటి ఫాస్ట్‌బౌలర్లు వికెట్ల వెనుక కొద్దిదూరం పరుగెత్తుకుంటూ వస్తేనే బంతిని సంధించాక అలసటకు గురౌతారు.
లండన్: క్రికెట్లో షోయబ్ అక్తర్, బ్రెట్ లీ వంటి ఫాస్ట్‌బౌలర్లు వికెట్ల వెనుక కొద్దిదూరం పరుగెత్తుకుంటూ వస్తేనే బంతిని సంధించాక అలసటకు గురౌతారు. కానీ ఇంగ్లండ్‌కు చెందిన ఓ వ్యక్తి ఒక బాల్‌ను విసిరేందుకు 14 గంటల్లో ఏకంగా 100 కిలోమీటర్లు పరుగెత్తుకొని రావడం విశేషం. ఈ మారథాన్ డెలివరీ సంధించిన వ్యక్తి పేరు సామ్ బొడొనొ. ఇంగ్లండ్‌లోని సర్రేకు చెందిన బొడొనొ.. ఆ దేశ దిగ్గజ క్రికెటర్ ఆండ్రూ స్ట్రాస్ భార్య పేరిట ఏర్పాటుచేసిన ‘ది రుత్ స్ట్రాస్ ఫౌండేషన్’ కోసం నిధుల సేకరణ నిమిత్తం ఈ పనిచేశాడు.
లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ నుంచి ఆగస్టు 29 అర్ధరాత్రి మొదలైన అతడి ప్రయాణం.. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం రెండు గంటలకు సర్రేలోని ఓ స్థానిక క్రికెట్ క్లబ్లో బంతిని విసరడంతో పూర్తైంది. క్రికెట్లో ఇదే లాంగెస్ట్ బౌలింగ్ రనప్. 2024లో ఇంగ్లండ్‌కే చెందిన టామ్ డన్ అనే వ్యక్తి 24 కి.మీ. పరుగెత్తి బాల్ విసిరాడు. బొడొనొ రికార్డును గిన్నిస్ వరల్డ్ రికార్డులో చేర్చనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్‌లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

