సోమవారం 23 నవంబర్ 2020
International - Nov 09, 2020 , 12:59:19

ప్ర‌పంచ‌వ్యాప్తంగా 5 కోట్లు దాటిన క‌రోనా కేసులు

ప్ర‌పంచ‌వ్యాప్తంగా 5 కోట్లు దాటిన క‌రోనా కేసులు

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్ మరో మైలురాయిని అందుకున్న‌ది.  ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 5 కోట్లు దాటింది.  ఈ విష‌యాన్ని జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ వెల్ల‌డించింది.  ఆదివారం నాటికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా 5.2 కోట్ల కేసులు న‌మోదు అయిన‌ట్లు ఆ వ‌ర్సిటీ చెప్పింది. మ‌హమ్మారి వ్యాప్తి ప్రారంభ‌మైన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 12 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు సంభ‌వించాయి. అమెరికాలో అయిదో వంత కేసులు రిపోర్ట్ అయిన‌ట్లు వ‌ర్సిటీ వెల్ల‌డించింది.  జాన్స్ హాప్కిన్స్ వ‌ర్సిటీ డేటా ప్ర‌కారం.. అమెరికాలో 9.8 మిలియ‌న్ల కేసులు న‌మోదు అయ్యాయి.  2,37000 వేల మంది మ‌ర‌ణించారు.  తాజాగా అమెరికాతో పాటు ప‌లు దేశాల్లో క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్నాయి.  శ‌నివారం రోజున ఆ దేశంలో 1,26000 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దాదాపు వెయ్యి మందికిపైగా మ‌ర‌ణించారు.