Donald Trump | మీడియా సమావేశంలో ఓ విలేకరి (reporter)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘గెట్ అవుట్’ (Get out of here) అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలే పశ్చిమాసియా దేశాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. తన పర్యటనలో భాగంగా ఖతార్‌ను కూడా ట్రంప్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి పాలకులు ట్రంప్‌కు ఓ విలాసవంతమైన విమానాన్ని బహుమతిగా ఇచ్చారు. దీనిపై ప్రముఖ మీడియా సంస్థ ఎన్బీసీ విలేకరి ట్రంప్‌ను ప్రశ్నించారు (asked about Qatar jet). ఆయన ప్రశ్న అధ్యక్షుడికి కోపం తెప్పించింది. ‘ఇక్కడి నుంచి వెళ్లిపో. విలేకరిగా విధులు నిర్వహించడానికి నువ్వు సరైన వ్యక్తివి కావు’ అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
‘నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావ్..? నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. ఇక్కడ మేం మాట్లాడుతున్న దానికి ఖతార్ జెట్‌కు సంబంధం ఏంటి..? వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ ఫోర్స్‌కు జెట్‌ను బహుమతిగా ఇచ్చారు. ఓకేనా..? అది చాలా గొప్ప విషయం. మనం ఇక్కడ ఇతర సమస్యల గురించి మాట్లాడుతున్నాము. ఆ సమస్యల నుంచి దారి మళ్లించేందుకే మీరు ప్రయత్నిస్తున్నారు. నువ్వు తెలివైన వాడివి కాదు. విలేకరిగా విధులు నిర్వహించేందుకు నీకు అర్హత లేదు’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాతో భేటీ అనంతరం వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
🚨 HOLY SHLIT: A reporter RUDELY interrupted President Trump’s meeting on the genoc*de of white South Africans… Trump FUMES.
This happened directly after Trump played the videos of the white genoc*de over in S. Africa.
NBC: “The Pentagon announced it would be accepting a… pic.twitter.com/acYejaW4or
— Eric Daugherty (@EricLDaugh) May 21, 2025
Also Read..
Earthquake | గ్రీస్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Israeli Embassy | వాషింగ్టన్లో ఉగ్రదాడి.. ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగులను కాల్చి చంపిన ముష్కరులు
కన్నడ రచయిత్రి బాను ముస్తాక్‌కు బుకర్ ప్రైజ్