Earthquake | ఆగ్నేయ ఐరోపా దేశం గ్రీస్ (Greece)లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.0గా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ ( German Research Centre for Geosciences) తెలిపింది. భూ అంతర్భాగంలో 77 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు పేర్కొంది.
అయితే, ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు భూ ప్రకంపనలతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా సునామీ హెచ్చరికలు (Tsunami alert) జారీ చేశారు. ఈ భూప్రకంపనల ప్రభావంతో గ్రీస్ సమీప దేశాలైన కైరో, ఇజ్రాయెల్, ఈజిప్టు, లెబనాన్, తుర్కియే, జోర్డాన్‌లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
కాగా, పది రోజుల వ్యవధిలోనే గ్రీస్‌లో భూకంపం సంభవించడం ఇది రెండోసారి. ఈనెల 14వ తేదీన కూడా గ్రీకు ద్వీపం కాసోస్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. భూ అంతర్భాగంలో 78 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. ఫ్రై పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది.
Also Read..
Israeli Embassy | వాషింగ్టన్లో ఉగ్రదాడి.. ఇజ్రాయెల్ ఎంబసీ ఉద్యోగులను కాల్చి చంపిన ముష్కరులు
కన్నడ రచయిత్రి బాను ముస్తాక్‌కు బుకర్ ప్రైజ్
India rejects Pakistan’s allegations | బలూచ్ బాంబ్ దాడిపై పాక్ ఆరోపణలు.. తోసిపుచ్చిన భారత్