కన్నడ రచయిత్రి బాను ముస్తాక్‌కు బుకర్ ప్రైజ్
కర్ణాటకకు చెందిన రచయిత్రి, సామాజిక కార్యకర్త, న్యాయవాది బాను ముస్తాక్ (77) ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. ‘హార్ట్ ల్యాంప్' అనే 12 చిన్న కథల సంకలనానికి గాను ఆమెను ఈ బహుమతి వరించింది.
- ‘హార్ట్ ల్యాంప్’ కథలకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
లండన్/న్యూఢిల్లీ, మే 21: కర్ణాటకకు చెందిన రచయిత్రి, సామాజిక కార్యకర్త, న్యాయవాది బాను ముస్తాక్ (77) ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. ‘హార్ట్ ల్యాంప్’ అనే 12 చిన్న కథల సంకలనానికి గాను ఆమెను ఈ బహుమతి వరించింది. 1990-2023 మధ్య కాలంలో ఈ కథలను రాసిన బాను ముస్తాక్ మంగళవారం రాత్రి లండన్‌లోని టేట్ మోడరన్ ఆర్ట్ గ్యాలరీలో జరిగిన కార్యక్రమంలో తన అనువాదకురాలు దీపా భస్తీతో కలిసి ఈ బహుమతిని అందుకున్నారు. దీని కింద బాను ముస్తాక్‌కు 50 వేల పౌండ్లు లభించాయి.
దీంతో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ బుకర్ ప్రైజ్‌ను అందుకున్న తొలి కన్నడ రచయిత్రిగా ఆమె ఘనత సాధించారు. ముస్లిం కుటుంబంలో జన్మించిన బాను ముస్తాక్ పాఠశాల విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే తొలిసారి ఓ చిన్న కథను రాశారు. ఆ తర్వాత 26 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు బాను ముస్తాక్ రాసిన ఓ కథ పత్రికలో ప్రచురితమవడంతో ఆమె ప్రతిభ వెలుగులోకి వచ్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

