Israeli Embassy | అగ్రరాజ్యం అమెరికాలో ఉగ్రదాడి కలకలం రేపింది. వాషింగ్టన్ డీసీ (Washington DC)లోని ఇజ్రాయెల్ ఎంబసీ (Israeli Embassy) ఉద్యోగులపై ఉగ్రవాదులు దాడి చేశారు. సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సిబ్బంది మృతి చెందారు.
అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్ తెలిపిన వివరాల ప్రకారం.. కేపిటల్ జెవిష్ మ్యూజియం (Jewish Museum) సమీపంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యూజియంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన సిబ్బందికి అతి సమీపంగా వచ్చిన ముష్కరులు కాల్పులు జరిపారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్లు తెలిసింది. కాల్పుల అనంతరం ఉగ్రవాదులు ప్రీ పాలస్తీనా నినాదాలు చేశారు. ఈ ఘటనను ఇజ్రాయెల్ యూఎన్ రాయబారి డానీ డానన్ తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై అమెరికా అధికారులు చర్యలు తీసుకుంటారని తాము విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు నివసించే వాషింగ్టన్ డీసీ నగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అలాంటి చోట ఉగ్రదాడి జరగడం కలకలం రేపుతోంది.
Also Read..
కన్నడ రచయిత్రి బాను ముస్తాక్‌కు బుకర్ ప్రైజ్
అమెరికా రక్షణకు గోల్డెన్ డోమ్!
India rejects Pakistan’s allegations | బలూచ్ బాంబ్ దాడిపై పాక్ ఆరోపణలు.. తోసిపుచ్చిన భారత్