Ayatollah Ali Khamenei | ఖమేని అంత్యక్రియల కోసం ఇరాన్‌కు వీకాఫ్ ఇచ్చాం.. మేం మంచోళ్లం : డొనాల్డ్ ట్రంప్
Ayatollah Ali Khamenei : ప్రస్తుతం ఇరాన్లో ఆ దేశ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేని, అతడి కుటుంబ సభ్యుల అంత్యక్రియలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఖమేని అంత్యక్రియల కోసం ఇరాన్‌కు వీకాఫ్ ఇచ్చాం అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
Ayatollah Ali Khamenei : ప్రస్తుతం ఇరాన్లో ఆ దేశ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేని, అతడి కుటుంబ సభ్యుల అంత్యక్రియలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఖమేని అంత్యక్రియల కోసం ఇరాన్‌కు వీకాఫ్ ఇచ్చాం అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. మౌంట్ రష్మోర్లో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. ఇరాన్లో ఖమేని అంత్యక్రియలు వారం రోజులపాటు జరగనున్నాయి. ఇప్పటికే కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ అంశంపై ట్రంప్ తాజా సమావేశంలో మాట్లాడారు.
ఇరాన్ ప్రజలు వారం రోజులపాటు అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు వీకాఫ్ ఇచ్చామన్నారు. ఎందుకంటే మనం మంచివాళ్లం అంటూ అక్కడి అమెరికన్లతో వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై అమెరికా విజయం సాధించిందన్నారు. ‘‘మనం ఇరాన్‌ను దారుణంగా ఓడించాం. యుద్ధం కారణంగా ఇరాన్ దారుణంగా నష్టపోయింది. వారు దీన్నుంచి కోలుకోవడానికి కష్టపడుతున్నారు. మనం చాలా మంచి వాళ్లం కాబట్టి ఖమేని అంత్యక్రియల కోసం ఇరాన్‌కు వీకాఫ్ ఇచ్చాం. అమెరికాలో ఉన్న అతివాదులు, ఉగ్రవాదుల వల్ల దేశ సమగ్రతకే ముప్పు పొంచి ఉంది. అమెరికాకు స్వతంత్రం లభించి 250 ఏళ్లవుతున్న తరుణంలో అమెరికా గుర్తింపుపై దాడి జరుగుతోంది. కమ్యూనిస్టుల నుంచి మన దేశానికి మళ్లీ ప్రమాదం పొంచి ఉంది. మనలో ఉన్న ప్రత్యేక లక్షణాన్ని మార్చడానికి, అమెరికన్ల స్ఫూర్తిని దెబ్బతీయడానికి, చరిత్రను మన నుంచి దూరం చేయడానికి కొన్నేళ్లుగా తీవ్రమైన ప్రయత్నం జరుగుతోంది’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇరాన్‌తో యుద్ధంతోపాటు ఆయన ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు వెలువడిన తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇరాన్‌పై దాడులు కొనసాగించిన అమెరికా ఇప్పుడు కాస్త విరామం ఇచ్చింది. ఖమేని అంత్యక్రియల నేపథ్యంలో ఇరు దేశాలు ఎలాంటి పరస్పర దాడులకు దిగడం లేదు. గత ఫిబ్రవరిలో ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడిలో ఖమేని మరణించాడు. ఇంతకాలానికి యుద్ధం ముగింపు దశకు చేరడంతో ఆయన అంత్యక్రియల్ని ఇరాన్ నిర్వహిస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

