బుధవారం 03 జూన్ 2020
International - Apr 25, 2020 , 18:39:10

నేపాల్‌లో మే 15 వ‌ర‌కు విమానాలు బంద్‌

నేపాల్‌లో మే 15 వ‌ర‌కు విమానాలు బంద్‌

ఖాట్మండ్: క‌రోనా వైర‌స్ వ్యాప్తి అంత పెద్ద‌గా ఏమీ లేదు. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన కేసులు కేవ‌లం 49 మాత్ర‌మే. అయినా కూడా అక్క‌డ లాక్‌డౌన్ విధించారు. పైగా మే 15 వ‌ర‌కు జాతీయ‌, అంత‌ర్జాతీయ విమానస‌ర్వీసుల‌ను ర‌ద్దుచేశారు. అదే మ‌న పొరుగు దేశం నేపాల్‌. ముందు జాగ్ర‌త్త‌గా ఈ చ‌ర్య‌ల‌న్ని చేప‌ట్టింది. ‌ డొమెస్టిక్, ఇంట‌ర్నేష‌న‌ల్ ఫ్లైట్స్ ఆప‌రేష‌న్లు మే 15 వ‌ర‌కు నిలిపేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. క‌రోనా క‌ట్ట‌డి కోసం ఏప్రిల్ 27 వ‌ర‌కు లాక్ డౌన్ విధించిన ఆ దేశం ఇప్పుడు విమాన ప్ర‌యాణాల‌పై నిషేధాన్ని మ‌రింత పొడిగించింది. ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి వైర‌స్ వ్యాప్తి జ‌ర‌గ‌కుండా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆ దేశ ప్రధాన మంత్రి కార్యాల‌యం ప్ర‌క‌టించింది. నేపాల్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 49 క‌రోనా కేసులు న‌మోదుకాగా..అందులో 11 మంది డిశ్చార్జ్ అయ్యారు. మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేదు.  అయితే లాక్ డౌన్ కూడా ఏప్రిల్ 27 నుంచి మ‌రికొన్నాళ్ల పాటు పొడిగించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.


logo