రోమ్ : గాజాలో కరువు నెలకొన్నట్లు ఐక్య రాజ్య సమితి శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. పశ్చిమాసియాలో ఇటువంటి పరిస్థితి రావడం ఇదే తొలిసారి. ఇక్కడ 5 లక్షల మందికిపైగా ఘోరమైన ఆకలితో బాధపడుతున్నట్లు ఐరాస నిపుణులు చెప్పారు. యూఎన్ ఎయిడ్ చీఫ్ టామ్ ఫ్లెచర్ మాట్లాడుతూ, ఈ కరువు పూర్తిగా నిరోధించగలిగినదేనని చెప్పారు.
ఇజ్రాయెల్ పద్ధతి ప్రకారం అడ్డంకులు సృష్టిస్తున్నందు వల్లే పాలస్తీనా భూభాగంలోకి ఆహారం వెళ్లడం లేదన్నారు. దీనిపై ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ స్పందిస్తూ, గాజాలో కరువు లేదని చెప్పింది. రోమ్ నుంచి పని చేస్తున్న ఐపీసీ ప్యానెల్ విడుదల చేసిన నివేదిక హమాస్ ఉగ్రవాద సంస్థ చెప్పిన అబద్ధాల ఆధారంగా తయారు చేసినదని దుయ్యబట్టింది.