Errol Musk | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin)పై ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) తండ్రి ఎర్రోల్ మస్క్ (Errol Musk) ప్రశంసలు కురిపించారు. పుతిన్ చాలా మంచి మనిషి అని, నిలకడగల స్వభాగం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. అలాంటి వ్యక్తిపై పాశ్చాత్య మీడియా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
మాస్కోలో నిర్వహించిన ‘ఫోరం ఆఫ్ ద ఫ్యూచర్ 2050’ కార్యక్రమంలో ఎర్రోల్ మస్క్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పుతిన్‌పై ప్రశంసలు కురిపించారు. పుతిన్ చాలా మంచి మనిషి అని, నిలకడ స్వభావం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. కానీ, పాశ్చాత్య మీడియా మాత్రం పుతిన్‌ను ప్రపంచ దేశాల ముందు విలన్‌గా చిత్రీకరిస్తోందని మండిపడ్డారు. అంతేకాదరు రష్యాను శత్రుదేశంలా చిత్రీకరించేందుకు తప్పుడు వార్తలను ప్రసారం చేస్తోందన్నారు. పుతిన్ గురించి వస్తున్న వార్తలన్నీ అర్థం లేనివని ఎర్రోల్ మస్క్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read..
Earthquakes | భారత్-మయన్మార్ సరిహద్దుల్లో వరుస భూకంపాలు.. 36 గంటల్లో ఏకంగా..