Earthquake | పపువా న్యూగినియాలో భారీ భూకంపం.. టిబెట్, పాకిస్థాన్లోనూ ప్రకంపణలు
పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపదేశం పపువా న్యూగినియాలో (Papua New Guinea) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 3.16 గంటలకు సముద్ర తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెకెక్ సమీపంలో భూమి కంపించింది.
సిడ్నీ: పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపదేశం పపువా న్యూగినియాలో (Papua New Guinea) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. మంగళవారం తెల్లవారుజామున 3.16 గంటలకు సముద్ర తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెకెక్ సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 6.5గా నమోదయిందని యూఎస్ జీయోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. వెకెక్కు (Wekak) 12 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. కాగా, భూకంపం వల్ల సునామీ (Tsunami) వచ్చే అవకాశం లేదని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.
An earthquake of Magnitude 6.5 on the Richter scale hit N. Coast of New Guinea, PNG at 03:16 am today: National Centre for Seismology pic.twitter.com/v9uUoetUiY
— ANI (@ANI) November 27, 2023
టిబెట్లో స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన జిజాంగ్ (Xizang), పాకిస్థాన్లో కూడా భూమి కంపించింది. తెల్లవారుజామున 3.45 గంటలకు జిజాంగ్లో 5.0 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్ సెఇంటర్ ఫర్ సీస్మోలీజీ (NCS) తెలిపింది.
An earthquake of Magnitude 5.0 on the Richter scale hit Xizang at 03:45 am today: National Centre for Seismology pic.twitter.com/rQ8rlsJhEc
— ANI (@ANI) November 27, 2023
అదేవిధంగా పాకిస్థాన్ (Pakistan) రాజధాని ఇస్లామాబాద్ సమీపంలో కూడా భూ ప్రకంపణలు వచ్చాయి. మంగళవారం తెల్లవారుజామున 3.38 గంటలకు 4.2 తీవ్రతతో భూమి కంపించిందని ఎన్సీఎస్ వెల్లడించింది. కాగా, ఈ మూడు భూకంపాల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదని అధికారులు చెప్పారు.
An earthquake of Magnitude 4.2 on the Richter scale hit Pakistan at 03:38 am today: National Centre for Seismology pic.twitter.com/wke51lrCjL
— ANI (@ANI) November 27, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

