తిమ్మాపూర్ రూరల్, జూలై 26: కరీంనగర్ జిల్లాలోని జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ పూర్వ విద్యార్థిని భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించింది. ఎం ఆశ్రిత 52 లక్షల యాన్యువల్ సాలరీతో బెంగళూరులోని ఎండ్వియా కంపెనీలో ఏఎస్ఐసీ ఇంజినీర్‌గా ఎంపికైంది. రామడుగు మండలం గోపాల్‌రావుపేటకు చెందిన ఆశ్రిత ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించింది.
చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండే ఆశ్రిత 2022లో జ్యోతిష్మతిలో బీటెక్ పూర్తి చేసిందని కాలేజీ చైర్మన్ జువ్వాడి సాగర్‌రావు తెలిపారు. గతంలో ఇస్రోలో ఇంజినీర్‌గా ఎంపికైనప్పటికీ ఆ ఉద్యోగాన్ని వదులుకున్నదని చెప్పారు. అలాగే రాజేశ్‌కుమార్ కాల్క్వామ్ ఇండియా కంపెనీలో 16.85లక్షల ప్యాకేజీతో అసోసియేట్ ఇంజినీర్ జాబ్ సాధించాడు. వీరిని కాలేజీ చైర్మన్‌తో పాటు కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ జువ్వాడి సుమిత్సాయి, ప్రిన్సిపాల్ డాక్టర్ కేఎస్ రావు, డీఎన్ పీకే వైశాలి అభినందించారు.