Earthquake | పాకిస్థాన్‌ను వణికించిన భూకంపం
Earthquake | పొరుగుదేశం పాకిస్థాన్ (Pakistan)లో మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 5.5గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
Earthquake | పొరుగుదేశం పాకిస్థాన్ (Pakistan)లో మరోసారి భూకంపం (Earthquake) సంభవించింది. బుధవారం తెల్లవారుజామున పాక్ – ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుకు (Pakistan-Afghanistan border) సమీపంలో భూమికి 105 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Centre for Seismology) వెల్లడించింది. భూకంపం తీవ్రత రిక్టరు స్కేలుపై 5.5గా నమోదైనట్లు వెల్లడించింది.
తెల్లవారుజామున 2:57 గంటల ప్రాంతంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్లు పేర్కొంది. కాగా ఈ భూకంపం ధాటికి ఇస్లామాబాద్, లాహోర్, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు.
కాగా, పాకిస్థాన్‌లో ఇటీవలే వరుస భూకంపాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. గత నెల 17న ఇస్లామాబాద్ సమీపంలో 4.7 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చాయి. అలాగే ఈ ఏడాది జనవరిలో 4.3తీవ్రతతో ఒకసారి, 6.0 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించింది.
Also Read..
యునిలీవర్‌లో 7,500 ఉద్యోగాల కోత
Zomato: గ్రీన్ రైడర్స్‌పై క్లారిటీ ఇచ్చిన జొమాటో సీఈవో
Dolma aunty | డోల్మా ఆంటీ మోమో.. ఢిల్లీలోని లజ్‌పత్‌నగర్‌లో ప్రసిద్ధి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

