Earthquake | అఫ్గానిస్థాన్‌లో స్వల్పంగా కంపించిన భూమి.. 4.4 తీవ్రత
అఫ్గానిస్థాన్‌లోని (Afghanistan) ఫైజాబాద్‌లో భూకంపం (Earthquake) సంభవించింది. సోమవారం ఉదయం 7.08 గంటలకు ఫైజాబాద్‌లో (Fayzabad) స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకటించింది.
కాబూల్: అఫ్గానిస్థాన్‌లోని (Afghanistan) ఫైజాబాద్‌లో భూకంపం (Earthquake) సంభవించింది. సోమవారం ఉదయం 7.08 గంటలకు ఫైజాబాద్‌లో (Fayzabad) స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకటించింది. ఫైజాబాద్‌కు 196 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూ అంతర్భాగంలో 158 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని వెల్లడించింది. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.
గత నెల 28న కూడా ఫైజాబాద్‌లో భూమి కంపించింది. 4.8 తీవ్రతతో భూకంపం నమోదయింది. ఇక ఆగస్టు 5న హిందూకుష్ పర్వత శ్రేణుల్లో (Hindu kush mountains) 5.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీని ప్రభావంతో ఢిల్లీ, జమ్ముకశ్మీర్, పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. కాగా, అఫ్గానిస్థాన్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తాయి. ప్రత్యేకంగా హిందూకుష్ పర్వత ప్రాంతాల్లో యూరేసియన్, ఇండియన్ టెక్టోనిక్ ఫలకాల మధ్య రాపిడి తలెత్తి భూకంపానికి కారణమవుతున్నాయి.
An earthquake of magnitude 4.4 hit 196km SSE of Fayzabad, Afghanistan at 07:08 am today: National Center for Seismology pic.twitter.com/exwGIXGMLl
— ANI (@ANI) September 4, 2023
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

