Fire Breaks Out : దేశ రాజధానిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఢిల్లీలోని పండిట్ పంత్ మార్గ్‌లోని బీజేపీ ఢిల్లీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి.
అగ్నిప్రమాదం కారణంగా కార్యాలయం భవనం నుంచి దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది.అగ్నిమాపక యంత్రాలను రప్పించిన అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
కాగా, విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారు. ఘటనా స్ధలంలో సహాయ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ప్రాధమిక దర్యాప్తు అనంతరం అగ్నిప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు వెలుగుచూస్తాయని అధికారులు పేర్కొన్నారు.
Read More :
Begumpet flyover | బేగంపేట ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం.. ఇద్దరికి గాయాలు