Avantika Vandanapu | హాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ అవంతిక వందనపు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి ప్రస్తుతం హాలీవుడ్ లో అదరగొడుతోంది. టాలీవుడ్, బాలీవుడ్ నుంచి కాకుండా ఏకంగా హాలీవుడ్ నుంచి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతుంది. అవంతిక వందనపు రీసెంట్గా ‘మీన్ గర్ల్స్’ (Mean Girls) అనే హాలీవుడ్ చిత్రంలో నటించగా ఈ చిత్రం వరల్డ్ వైడ్గా బ్లాక్ బస్టర్ అయ్యింది. ప్రస్తుత టీనేజ్ యువత ఆలోచనల ఆధారంగా వచ్చిన ఈ చిత్రం అవంతికకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
అయితే ఈ భామ తాజాగా హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఊహించని లుక్ లో దర్శనమిచ్చింది. హాలీవుడ్ లో రాణిస్తున్న బ్లాక్ బ్యూటీస్ ని హైలెట్ చేసే గలొరి మ్యాగజైన్ కవర్ పేజీ (Galore’s cover)పై అవంతిక వందనపు దర్శనమిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రే కలర్ హెయిర్, గ్రే కలర్ డ్రెస్లో హాలీవుడ్ హీరోయిన్లా మెరిసిపోతుంది అవంతిక.