Earthquake : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇవాళ అక్కడ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఆ భూకంప తీవ్రత 4.2 పాయింట్లుగా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ఈ విషయాన్ని వెల్లడించింది. సోమవారం సాయంత్రం 4 గంటలకు పాకిస్థాన్‌లో భూమి కంపించిందని ఎన్సీఎస్ అధికారులు తెలిపారు.
పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు పాకిస్థాన్ సైన్యమే శిక్షణ ఇచ్చినట్లు వెల్లడికావడంతో భారత్ ఆ దేశంపై గుర్రుగా ఉంది. అన్ని రకాలుగా ఆ దేశాన్ని దగ్బంధిస్తోంది. ఇప్పటికే సింధూ జలాలను నిలిపేసింది. ఎగుమతులు, దిగుమతులను బ్యాన్ చేసింది. సమయం చూసి కోలుకోలేని దెబ్బకొట్టేందుకు సిద్ధంగా ఉంది. మరోవైపు బలూచ్ తిరుగుబాటుదారులు స్వాతంత్య్రం కోసం దాడులు చేస్తున్నారు.
అదేవిధంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన పాకిస్థాన్‌ను ఇప్పుడు ఈ సమస్యలన్నీ చుట్టుముట్టాయి. దాంతో ఆ దేశం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది.