శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Jul 17, 2020 , 02:04:09

ఆక్స్‌ఫర్డ్‌ టీకా ‘డబుల్‌' సక్సెస్‌!

ఆక్స్‌ఫర్డ్‌ టీకా ‘డబుల్‌' సక్సెస్‌!

లండన్‌: కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్‌ అభివృద్ధిలో పలు దేశాలు, సంస్థలు నిర్విరామంగా పరిశోధనలు జరుపుతున్నాయి. ముఖ్యంగా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసిన  ChAdOx1 nCoV-19 వ్యాక్సిన్‌పై అందరి దృష్టి నెలకొన్నది. ఈ వ్యాక్సిన్‌ తొలిదశ క్లినికల్‌ ట్రయల్స్‌లో డబుల్‌ సక్సెస్‌ సాధించినట్టు పరిశోధకులు పేర్కొన్నట్టు బ్రిటన్‌ మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. తొలిదశ ట్రయల్స్‌లో భాగంగా బ్రిటన్‌లోని వలంటీర్లకు ఇచ్చిన టీకా ఆశాజనక ఫలితాలను సాధించినట్టు పేర్కొన్నాయి. వ్యాక్సిన్‌ తీసుకున్న వలంటీర్ల శరీరంలో యాంటీబాడీలతో పాటు ‘కిల్లర్‌ టీ-సెల్స్‌' కూడాఏర్పడినట్టు ‘ది డైలీ టెలిగ్రాఫ్‌' వెల్లడించింది. యాంటీబాడీలతో పాటు టీ-సెల్స్‌ ఉత్పత్తి అవ్వడం కొవిడ్‌-19 నుంచి రెండు విధాలుగా రక్షిస్తుందని పరిశోధన బృందానికి సన్నిహితంగా ఉన్న వర్గాలు తెలిపినట్టు మరో మీడియా వివరించింది. వైరస్‌ను కట్టడి చేయడానికి యాంటీబాడీలు కొన్ని నెలల వరకు సాయంచేస్తే, టీ-సెల్స్‌ కొన్ని ఏండ్ల వరకూ వైరస్‌తో పోరాటం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. 


logo