Donald Trump | టారిఫ్ల (tariff) విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా మరో బాంబు పేల్చారు. ఫర్నిచర్, కలపపై సుంకాల మోత మోగించారు. కలప (lumber)పై 10 శాతం, కిచెన్ క్యాబినెట్లు (kitchen cabinets), అప్హోల్స్టర్డ్ ఫర్నిచర్ (upholstered furniture)పై 25 శాతం సుంకాలను ప్రకటించారు. ఈ టారిఫ్లు అక్టోబరు 14 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపారు.
మరోవైపు అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా సోమవారం ప్రకటించారు. విదేశాలలోని పోటీదారులు అమెరికన్ సినీ వ్యాపారాన్ని కొల్లగొడుతున్నారని ట్రంప్ తెలిపారు. పసిబిడ్డ నుంచి చాక్లెట్ చోరీ చేసిన విధంగానే ఇతర దేశాలు అమెరికా సినీ నిర్మాణ వ్యాపారాన్ని చోరీ చేస్తున్నాయి అని ట్రంప్ ఆరోపించారు. బలహీన, అసమర్థ గవర్నర్ కారణంగా ప్రత్యేకంగా కాలిఫోర్నియా తీవ్రంగా నష్టపోయింది అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎన్నటికీ పరిష్కారం కాని ఈ సుదీర్ఘ సమస్యను పరిష్కరించేందుకు అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read..
Bihar Poll Schedule | వారం రోజుల్లో బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల..!