Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారానికి (Nobel Peace Prize) నామినేట్ అయ్యారు. రిపబ్లికన్ పార్టీ ఎంపీ క్లాడియా టెన్నీ (Claudia Tenney).. ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించారు. దీంతో ఈ విశిష్ట పురస్కారానికి ట్రంప్ పేరు నామినేట్ కావడం ఇది నాలుగోసారి.
మధ్య ప్రాచ్యంలో గత 30 ఏళ్లలో తొలిసారి శాంతి ఒప్పందాలను సులభతరం చేయడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని టెన్నీ ఈ సందర్భంగా తెలిపారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు (Israeli-Palestinian conflict) పరిష్కారం చూపించకుండా మధ్యప్రాచ్యంలో అదనపు శాంతి ఒప్పందాలు కుదర్చడం సాధ్యం కాదని నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు దశాబ్దాలుగా భావిస్తూ వచ్చాయని గుర్తు చేశారు.
అయితే, ఆ వాదన తప్పని ట్రంప్ నిరూపించారని, మధ్య ప్రాచ్యంలో శాంతి ఒప్పందాల రూపకల్పనకు ట్రంప్ సాహసోపేతమైన ప్రయత్నాలు చేశారని వివరించారు. అయితే ఆయన కృషి నోబెల్ శాంతి బహుమతి కమిటీ గుర్తింపునకు నోచుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఇవాళ ట్రంప్ పేరును విశిష్ట పురస్కారానికి నామినేట్ చేసినట్టు తెలిపారు. కాగా, ట్రంప్ ఇప్పటికే పలుమార్లు ఈ విశిష్ట పురస్కారానికి నామినేట్ అయినప్పటికీ ఒక్కసారి కూడా బహుమతిని గెలుచుకోలేకపోయారు.
Donald Trump was instrumental in facilitating the first new peace agreements with Israel in almost 30 years. That’s why I nominated him for a Nobel Peace Prize.
More here ⬇️ https://t.co/trSs0rGljn
— Rep. Claudia Tenney (@RepTenney) January 31, 2024
Also Read..
Hemant Soren | ఈడీ అధికారులపై కేసు పెట్టిన సీఎం హేమంత్ సోరెన్
Arvind Kejriwal | మద్యం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఐదోసారి ఈడీ నోటీసులు