Donald Trump | అఫ్ఘానిస్థాన్, పాకిస్థాన్ (Afghanistan-Pakistan) మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్.. శుక్రవారం అఫ్ఘాన్‌పై వైమానిక బాంబు దాడులు చేసింది. డ్యారాండ్ లైన్ వెంబడి అఫ్ఘాన్‌లోని పాక్టికా ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో పాక్ వైమానిక దాడులకు (Airstrikes) పాల్పడింది. ఈ దాడిలో ముగ్గురు అఫ్ఘాన్ దేశవాళి క్రికెటర్లు సహా మొత్తం పది మంది మరణించారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘర్షణలను ఆపడం తనకు చాలా తేలికైన విషయం అని పేర్కొన్నారు.
‘ఇప్పటికే ఎనిమిది యుద్ధాలు ఆపాను. నా తదుపరి లక్ష్యం పాక్-అఫ్ఘాన్ మధ్య శాంతికి మధ్యవర్తిత్వం వహించడమే. అఫ్గాన్‌పై పాక్ దాడి చేసిందనే విషయం నాకు అర్థమైంది. ఈ సంఘర్షణను పరిష్కరించాల్సి వస్తే.. అది నాకు చాలా సులభం. యుద్ధాలను ఆపడం అంటే నాకు చాలా ఇష్టం. రెండు దేశాల మధ్య సంఘర్షణలను ఆపడం నాకు చాలా తేలిక. ఇది నేను ఆపబోయే తొమ్మిదో యుద్ధం అవుతుంది. అయినా నాకు నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) రావడం లేదు’ అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
ఈ నెల 14న తాలిబన్ సైనిక స్థావరాలపై పాక్ సైన్యం పెద్దఎత్తున దాడులకు పాల్పడింది. దీంతో తాలిబన్ సైన్యం కూడా ప్రతిదాడులకు దిగడంతో సరిహద్దుల్లో ఇరుదేశాల బలగాల మధ్య భీకర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అయితే 48 గంటల పాటు కాల్పుల విరమణ పాటించాలని రెండు దేశాలు నిర్ణయించడంతో దాడులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. తాజాగా రెండ్రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్.. అఫ్ఘాన్‌పై మరోసారి దాడులకు దిగింది. డ్యారాండ్ లైన్ వెంబడి అఫ్ఘాన్‌లోని పాక్టికా ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో పాక్ వైమానిక దాడులకు (Airstrikes) పాల్పడింది. దీంతో పది మంది మరణించారు. వారిలో ముగ్గురు అఫ్ఘాన్ దేశవాళి క్రికెటర్లు కూడా ఉన్నారు. మృతిచెందిన క్రికెటర్లను కబీర్, సిబాతుల్లా, హరూన్గా గుర్తించారు.
Also Read..
Pak Afghan Clashes | అఫ్ఘాన్‌పై పాక్ వైమానిక దాడులు.. ముగ్గురు క్రికెటర్లు సహా 10 మంది మృతి
జాబిల్లి ధూళే ఆవాసం!.. కష్టమేమీకాదని నాసా పరిశోధకులు