Donald Trump : అగ్రరాజ్యం అమెరికా (USA) దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభిస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. దక్షిణ కొరియా (South Korea) లోని బుసాన్‌లో చైనా అధ్యక్షుడు (China president) జిన్‌పింగ్ (Jinping) తో భేటీకి ముందు ‘ట్రూత్ సోషల్’లో ఆయన ఈ మేరకు పోస్టు చేశారు.
అణ్వాయుధాలకు ఉన్న విధ్వంసకర శక్తి కారణంగా అణు పరీక్షలు చేయకూడదని గతంలో అధికారంలో ఉన్నప్పుడు తాను నిర్ణయించుకున్నానని, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా, చైనా సహా ఇతర దేశాలు వేగంగా తమ అణు సామర్థ్యాలను పెంచుకుంటున్నాయని చెప్పారు. అణ్వాయుధ సామర్థ్యంలో అమెరికా, రష్యా, చైనా ఐదేళ్లలోపు సమానస్థాయికి చేరుకునే అవకాశముందని అభిప్రాయపడ్డారు.
అందుకే అమెరికా మళ్లీ అణ్వాయుధ పరీక్షలు ప్రారంభించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. అణ్వాయుధ పరీక్షల పునఃప్రారంభానికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ వార్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.