ఇస్లామాబాద్: ఉమ్మడి పాకిస్థాన్ 1971లో విడిపోయిన తర్వాత మొదటిసారి పాక్, బంగ్లాదేశ్‌ల మధ్య అధికారికంగా ప్రత్యక్ష వాణిజ్య సంబంధాలు పునః ప్రారంభమయ్యాయి. పాకిస్థాన్ ఖాసిమ్ నౌకాశ్రయం నుంచి బంగ్లాదేశ్‌కు 50 వేల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేయడానికి అనుమతించడంతో ఈ సంబంధాలు మొదలయ్యాయి. పాక్ వాణిజ్య కార్పొరేషన్ నుంచి ఈ బియ్యాన్ని కొనుగోలు చేయడానికి ఇరు దేశాల ప్రభుత్వాల మధ్య ఈ నెల మొదట్లో ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల నౌకా వాణిజ్యంలో దీన్ని మైలురాయిగా ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక అభివర్ణించింది. షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయాక బంగ్లా ప్రభుత్వంతో పాకిస్థాన్ సర్కారు చక్కని వాణిజ్య, దౌత్య సంబంధాలు కొనసాగిస్తున్నది.