టెహ్రాన్: ఇరాన్ బొగ్గు గని(Coal Mine)లో జరిగిన పేలుడు ఘటనలో అనేక మంది మృతిచెందారు. ఇప్పటి వరకు కనీసం 38 మంది మరణించి ఉంటారని అంచనా వేశారు. మరో 14 మంది గని కార్మికుల ఆచూకీ ఇంకా చిక్కలేదు. రాజధాని టెహ్రాన్‌కు 335 కిలోమీటర్ల దూరంలో ఉన్న తబాస్‌లో బొగ్గు గని ఉన్నది. శనివారం రాత్రి గనిలో పేలుడు జరిగింది. ఆదివారం చాలా మంది మృతదేహాలను వెలికితీశారు. గనిలో ఉన్న సమయంలో భారీగా స్మోక్ వచ్చిందని, ఆ సమయంలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారిందని ఓ కార్మికుడు తెలిపాడు. మీథేన్ వాయువు అకస్మాత్తుగా లీక్ కావడం వల్ల పేలుడు జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కానీ పేలుడుకు ముందు లీకేజీ ఉన్నట్లు ఎటువంటి సంకేతాలు కనిపించలేదని అధికారులు వెల్లడించారు. అయితే మృతదేహాలపై ఎటువంటి బ్లాస్ట్ గాయాలు లేవని, వాళ్లు పేలుడుకు ముందే వాయువు వల్ల ప్రాణాలు కోల్పోయి ఉంటారని భావిస్తున్నారు. మందాన్జో కంపెనీ తబాస్ పర్వాదేహ్ 5 మైన్‌ను ఆపరేట్ చేస్తున్నది.