సోమవారం 01 జూన్ 2020
International - Apr 29, 2020 , 07:26:05

కరోనానా? కావసాకీనా?

కరోనానా? కావసాకీనా?

లండన్‌: ఇప్పటికే కరోనాతో అతలాకుతలం అవుతున్న బ్రిటన్‌, ఇటలీ దేశాల్లోని చిన్నారుల్లో అంతుచిక్కని వ్యాధి ప్రబలడం ఆందోళన కలిగిస్తున్నది. అధిక జ్వరం, రక్తనాళాల్లో వాపు వంటి లక్షణాలతో పెద్ద సంఖ్యలో పిల్లలు దవాఖానల్లో చేరుతున్నారు. ఈ వ్యాధికి, కరోనా మహమ్మారికి ఏమైనా సంబంధం ఉన్నదా అన్నదానిపై ఇరుదేశాల వైద్య నిపుణులు పరిశీలన జరుపుతున్నారు. కావసాకీ వ్యాధి తరహా లక్షణాలతో ఉత్తర ఇటలీలో తొమ్మిదేండ్లలోపు చిన్నారులు  దవాఖానల్లో చేరుతున్నారు. అలాగే బ్రిటన్‌లోని చిన్నారుల్లోనూ ఈ లక్షణాలు కనిపిస్తుండడంతో అక్కడి వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు. 


logo