బుధవారం 27 జనవరి 2021
International - Dec 06, 2020 , 18:01:22

2 కోట్ల స్మార్ట్‌ఫోన్ల‌లో మాల్‌వేర్‌.. చిక్కుల్లో చైనా కంపెనీ

2 కోట్ల స్మార్ట్‌ఫోన్ల‌లో మాల్‌వేర్‌.. చిక్కుల్లో చైనా కంపెనీ

చైనాకు చెందిన జియోనీ కంపెనీ 2 కోట్ల‌కు పైగా యూజ‌ర్ల‌ స్మార్ట్‌ఫోన్ల‌లో మాల్‌వేర్‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు తాజాగా విచార‌ణ‌లో తేలింది. యాడ్స్‌, ఇత‌ర మార్గాల ద్వారా యూజ‌ర్ల ఫోన్ల నుంచి అక్ర‌మంగా లాభాలు ఆర్జించ‌డానికి జియోనీ సంస్థ ఈ మాల్‌వేర్‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు చైనాకు చెందిన జ‌డ్జ్‌మెంట్ డాక్యుమెంట్ నెట్‌వ‌ర్క్ గుర్తించింది. జియోనీ అనుబంధ సంస్థ అయిన షెంజెన్ ఝిపు టెక్నాల‌జీ కంపెనీ లిమిటెడ్ స్టోరీ లాక్ స్క్రీన్ యాప్‌కు అప్‌డేట్‌ ద్వారా ట్రోజ‌న్ హార్స్‌ను జియోనీ స్మార్ట్‌ఫోన్ల‌లో ప్ర‌వేశ‌పెట్టింది. 2018 డిసెంబ‌ర్ - 2019 అక్టోబ‌ర్ మ‌ధ్య ఈ ప‌ని చేసిన‌ట్లు విచార‌ణ‌లో తేలింది. 2.17 కోట్ల స్మార్ట్‌ఫోన్ల‌లో లివింగ్ ట్రోజ‌న్ హార్స్ అప్‌డేట్ చేయ‌డానికి డార్క్ హార్స్ ప్లాట్‌ఫామ్ వాడిన‌ట్లు గుర్తించారు. ఈ టెక్నిక్ ద్వారా ఆ కంపెనీ అద‌నంగా 27.85 మిలియ‌న్ల యువాన్‌లు (సుమారు రూ.31 కోట్లు) ఆర్జించిన‌ట్లు తేలింది. షెంజెన్ ఝింపు సంస్థ అక్ర‌మంగా యూజ‌ర్ల స‌మాచారాన్ని నియంత్రించింద‌ని కోర్టు తేల్చింది. సంస్థ‌కు చెందిన ముగ్గురికి జైలు శిక్ష విధించ‌డంతోపాటు 2 ల‌క్ష‌ల యువాన్ల (సుమారు రూ.23 ల‌క్ష‌లు) జ‌రిమానా విధించింది. 


logo