గురువారం 28 మే 2020
International - Apr 28, 2020 , 16:40:34

బ్రెజిల్ అధ్య‌క్షుడికి అవినీతి సెగ‌

బ్రెజిల్ అధ్య‌క్షుడికి అవినీతి సెగ‌

క‌రోనా వ్యాధిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసి విమ‌ర్శ‌లపాలైన బ్రెజిల్ అధ్య‌క్షుడు జైర్ బొల్సొనారో మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. ప‌లు కేసుల్లో పోలీసుల విచార‌ణ‌లో జోక్యం చేసుకున్నార‌ని ఆయ‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ఆ దేశ సుప్రీంకోర్టు విచార‌ణ కు ఆదేశించింది. గ‌త శుక్ర‌వారం దేశ పోలీస్ చీఫ్‌ను అధ్య‌క్షుడు ప‌ద‌వి నుంచి తొలగించారు. దీనిపై విబేధించిన రక్ష‌ణ‌శాఖ మంత్రి, మాజీ న్యాయ‌మూర్తి సెర్జియో మోరో త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ సంద‌ర్భంగా అధ్యక్షుడిపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. పోలీసులీ ప‌నిలో అధ్య‌క్షుడు జోక్యం చేసుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. దాంతో సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి సెల్సో డీ మెల్లో  ఈ అంశంపై విచార‌ణ‌కు ఆదేశించారు. అస‌లే కోవిడ్‌-19 వైర‌స్ విజృంభ‌ణ‌తో వ‌ణికిపోతున్న దేశంలో ఈ విచార‌ణ ఎలాంటి రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తుందోన‌ని ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ‌


logo