e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home News భారత్‌లో విడుదలైన వివో X60 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు

భారత్‌లో విడుదలైన వివో X60 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు

భారత్‌లో విడుదలైన వివో X60 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ వివో మరో ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను భారత్‌లో ఆవిష్కరించింది. వివో X60 సిరీస్‌లో వివో X60 ప్రొ+, వివో X60 ప్రొ, వివో X60 పేర్లతో ఏకంగా మూడు మోడళ్లను ఒకేసారి రిలీజ్‌ చేసింది. ట్రిపుల్‌, క్వాడ్‌ రియర్‌ కెమెరా సెటప్‌లు, ఫాస్ట్‌ఛార్జింగ్‌ సపోర్ట్‌, హై రిఫ్రెష్‌ రేట్‌ డిస్‌ప్లేలు వంటి అద్భుత ఫీచర్లతో 5జీ ఫోన్లను లాంచ్‌ చేశారు.


8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ కలిగిన వివో ఎక్స్ 60 ధర రూ .37,990 కాగా 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ .47,990గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ మిడ్‌నైట్‌ బ్లాక్‌, షిమ్మర్‌ బ్లూ కలర్లలో అందుబాటులో ఉంది. వివో ఎక్స్ 60 ప్రోలో 12 జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజ్‌ మోడల్‌ ధర రూ .49,990గా ఉంది. X60 Pro+ స్మార్ట్‌ఫోన్‌లో 12 GB ర్యామ్‌+ 256 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ధర రూ.69,990గా నిర్ణయించారు. మూడు ఫోన్లను కూడా ప్రీ బుకింగ్‌ చేసుకోవడానికి అవకాశం ఉండగా ఏప్రిల్‌ 2 నుంచి వీటిని కొనుగోలు చేయొచ్చు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
భారత్‌లో విడుదలైన వివో X60 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు

ట్రెండింగ్‌

Advertisement