వాషింగ్టన్: విమానం చక్రంలోని ల్యాండింగ్ గేర్ వద్ద వ్యక్తి మృతదేహం కనిపించింది. (Body Found Inside Plane Wheel) సాధారణ తనిఖీ సందర్భంగా సిబ్బంది దీనిని గుర్తించారు. ఈ సంఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777-200ఈఆర్ విమానం జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ విమానాశ్రయం నుంచి బయలుదేరి సెప్టెంబర్ 27న నార్త్ కరోలినాలోని షార్లెట్ డగ్లస్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది. రెండు రోజులుగా ఆ ఎయిర్‌పోర్ట్‌లోని హ్యాంగర్‌లో అది నిలిచి ఉన్నది.
కాగా, సెప్టెంబర్ 28 ఆదివారం ఉదయం 9 గంటల తర్వాత సాధారణ నిర్వహణ తనిఖీల సమయంలో ఆ విమానాన్ని సిబ్బంది పరిశీలించారు. ఈ సందర్భంగా విమానం టైర్ వద్ద ఉన్న ల్యాండింగ్ గేర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించింది. అక్కడ దాక్కున్న ఆ వ్యక్తి చనిపోయినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Also Read:
Bishnoi Gang | లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు షాక్.. ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కెనడా..!
Bengaluru Student Dies | మరో విద్యార్థిని ప్రాణాలు తీసిన.. బెంగళూరు రోడ్డు గుంతలు
Leh Apex Body | కేంద్రంతో చర్చలను బహిష్కరించిన లేహ్ అపెక్స్ బాడీ
Watch: హుక్ తెగి పక్కకు ఒరిగిన జైంట్ వీల్, గాలిలో రైడర్స్.. తర్వాత ఏం జరిగిందంటే?