అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీకి సన్నిహితుడు. ట్రంప్ యంత్రాంగంలో మస్క్‌ది కీలక పాత్ర. దీంతో మస్క్ ఫ్యాక్టరీ నుంచి గ్రోక్ సేవలు అందుబాటులోకి రాగానే తొలుత బీజేపీ నేతలు ఆనందంగా ఉన్నారు. అయితే, 2028లో రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ 87 సీట్లతో అధికారంలోకి వస్తుందని గ్రోక్ తేల్చిచెప్పడంతో రాష్ట్ర బీజేపీ నేతల దిమ్మదిరిగిపోయినట్లయింది. ఒకవైపు గ్రోక్ ఇలా ఎదురుదాడి చేస్తుంటే మరోవైపు ఇతర ఏఐ టూల్స్ కూడా దానికి అండగా నిలబడుతున్నాయి.
బీజేపీ ఏ వార్తను ప్రసారం చేసినా.. వాస్తవమేంటో తెలుసుకోవడానికి గ్రోక్తో పాటు మిగతా ఏఐ టూల్స్ చాట్‌జీపీటీ, డీప్‌సీక్, జెమినీలనూ నెటిజన్లు ఆశ్రయిస్తున్నారు. మొత్తానికి మానవ మేధస్సు చేయలేని సత్యాసత్యాల అన్వేషణను, చూపలేని విచక్షణా వివేకాన్ని కృత్రిమమేధ చూపిస్తున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘మాటలతో మాయలతో మనుషుల్ని ఏమార్చవచ్చు. అర్ధసత్యాలతో అబద్ధాలను వ్యాప్తిచేయవచ్చు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని తట్టుకోవడం ఎలా?’ అన్నదే ఇప్పుడు కమలనాథుల ముందు పెద్ద ప్రశ్నగా మారింది.