కీవ్ : ఉక్రెయిన్‌పై భారీ అటాక్ చేసింది రష్యా. రెండో అతిపెద్ద నగరమైన ఖార్కీవ్పై విరుచుకుపడింది. సుమారు 50 డ్రోన్లతో అటాక్(Drone Attack) చేసింది. ఆ దాడిలో ముగ్గురు మృతిచెందారు. మరో 17 మంది గాయపడ్డారు. డ్రోన్లతో పాటు రెండు మిస్సైళ్లు, నాలుగు గ్లైడింగ్ బాంబులను కూడా ఖార్కీవ్ నగరంపై రష్యా ఫైర్ చేసినట్లు ఉక్రెయిన్ పేర్కొన్నది. కేవలం 90 నిమిషాల వ్యవధిలో ఆ అటాక్ ముగిసినట్లు ఖార్కీవ్ మేయర్ తెలిపారు. దాడిలో అపార్ట్మెంట్ బ్లాక్‌లు, ప్రైవేట్ ఇండ్లు ధ్వంసం అయ్యాయి.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. ఇటీవల పశ్చిమ దేశాల నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నేతలు ఉదాసీనంగా ఉండడం వల్లే దాడులు కొనసాగుతున్నట్లు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా పుతిన్‌పై వత్తిడి తేలేకపోతున్నట్లు చెప్పారు. తాజాగా జరిగిన దాడులపై రష్యా ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. ఖేర్సన్ నగరంలో ఓ బిల్డింగ్‌పై జరిగిన దాడిలో ఓ జంట మృతిచెందినట్లు తెలుస్తోంది.
వందల సంఖ్యలో డ్రోన్లు, మిస్సైళ్ల దాడి జరిగినట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహ తెలిపారు. ఖార్కీవ్లో శుక్రవారం రాత్రి భీకరంగా సాగిందన్నారు. ఉక్రెయిన్ దేశవ్యాప్తంగానూ దాడులు జరిగినట్లు చెప్పారు. డోనస్కీ, డినిప్రో, టెర్నోపిల్, ఒడిసా ప్రాంతాల్లో అటాక్‌లు జరిగాయి. చాలా చోట్ల ప్రజలు గాయపడ్డారు, చనిపోయారని చెప్పారు. ఎనర్జీ మౌళికసదుపాయాలు దెబ్బతిన్నట్లు తెలిపారు.