Bangladesh | భారత్-బంగ్లాదేశ్ మధ్య టూరిస్ట్ వీసా సేవలు ప్రారంభం.. రెండేళ్ల తర్వాత బంగ్లాదేశీయులకు అనుమతి
Bangladesh : ఇటీవలి కాలంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు కాస్త బలపడుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఇటీవలే దౌత్య సేవలు ప్రారంభమయ్యాయి. రాయబార కార్యాలయాలు రెండు దేశాల్లో పని చేస్తున్నాయి. ఈ అంశంలో తాజాగా మరో ముందడుగు పడింది. రెండు దేశాల మధ్య టూరిస్ట్ వీసా సేవలు ప్రారంభం కానున్నాయి.
Bangladesh : ఇటీవలి కాలంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు కాస్త బలపడుతున్నాయి. ఇరు దేశాల మధ్య ఇటీవలే దౌత్య సేవలు ప్రారంభమయ్యాయి. రాయబార కార్యాలయాలు రెండు దేశాల్లో పని చేస్తున్నాయి. ఈ అంశంలో తాజాగా మరో ముందడుగు పడింది. రెండు దేశాల మధ్య టూరిస్ట్ వీసా సేవలు ప్రారంభం కానున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ సేవలు ప్రారంభమవుతుండటం విశేషం. ఈ విషయాన్ని బంగ్లాలో భారత రాయబారి దినేష్ త్రివేది వెల్లడించారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని వీసా జారీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ నెల 28 నుంచి టూరిస్ట్ వీసా సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీని ద్వారా బంగ్లాదేశ్ నుంచి ఇండియా రావాలనుకునే వారికి భారత పర్యాటక వీసాలు జారీ అవుతాయి. అలాగే, అనారోగ్యంతో బాధపడుతున్న బంగ్లా పౌరులు ఇండియాలో వైద్యం చేయించుకోవాలి అనుకుంటే.. మానవతా కోణంలో స్పందించి ఇండియాకు మెడికల్ వీసాలు కూడా జారీ చేస్తామని దినేష్ త్రివేది తెలిపారు. వీసాల జారీకి బంగ్లాలో ఐదు కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. అవి ఢాకా, రాజ్షాహి, ఛిట్టగాంగ్, సిల్హెట్, ఖుల్నా. కొంతకాలంగా ఇండియా, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. 2024లో అక్కడి ఇందిరా గాంధీ కల్చరల్ సెంటర్‌ను ధ్వంసం చేయడం నుంచి, భారత వీసా జారీ కేంద్రాలపై దాడులు వంటి కారణాలతో 2024 నుంచి వీసాల జారీ నిలిచిపోయింది. అప్పటి బంగ్లా పాలకుడు యూనస్ అనుసరించిన వైఖరి కూడా ఇందుకు కారణం.
ఇదే సమయంలో అక్కడ హిందువులపై దాడులు, బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆశ్రయమివ్వడం వంటివి రెండు దేశాల మధ్య దూరాన్ని మరింత పెంచాయి. అయితే, ఇటీవల బంగ్లాలో జరిగిన ఎన్నికల్లో విజయం అనంతరం గత ఫిబ్రవరిలో తారిఖ్ రెహమాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఇరు దేశాల మధ్య సంబంధాలు నెమ్మదిగా బలపడుతున్నాయి. దీనిలో భాగంగా రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగయ్యాయి. తాజాగా వీసా జారీని కూడా ఇండియా ప్రారంభించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరెంట్ లేక ఎండిపోతున్న పంటలు.. హద్నూర్ సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు
Candidates Ultimatum | టీజీపీఎస్సీకి గ్రూప్-1 అభ్యర్థుల అల్టిమేటం.. జీఆర్ఎల్ ఇవ్వకుంటే ఆమరణ దీక్ష
Narendra Modi | నోయిడాలోని జెవార్ ఎయిర్‌పోర్టుకు నరేంద్ర మోదీ పేరు.. ప్రకటించిన యూపీ సీఎం యోగి
గ్రామాల్లో ఎక్సైజ్ దాడులు.. నాటుసారా, బెల్లం పానకం పట్టివేత
Bus Collides With Truck | లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ మృతి, 12 మంది ప్రయాణికులకు గాయాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

