Sheikh Hasina | బంగ్లాదేశ్ (Bangladesh)లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా (Sheikh Hasina)పై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) నేడు తీర్పు వెలువరించనున్న విషయం (Court Verdict) తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం అర్థరాత్రి నుంచి అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. రాజధాని ఢాకా (Dhaka) సహా పలు చోట్ల హింస్మాతక ఘటనలు చోటు చేసుకున్నాయి. హసీనా మద్దతుదారులు యూనస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అప్రమత్తమైన బంగ్లా ప్రభుత్వం దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది.
గతేడాది విద్యార్థుల నిరసనల అణచివేత కేసులో హసీనా అమానుష చర్యలకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో మాజీ ప్రధానిపై పలు కేసులు నమోదయ్యాయి. వీటిపై అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ నేడు తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పు నేపథ్యంలో రాజధాని ఢాకా సహా ప్రధాన నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. బంగ్లా అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. అశాంతి నెలకొనే అవకాశం ఉందన్న ముందస్తు అంచనాలతో అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలు సహాల ప్రధాన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.
ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారడంతో.. ప్రజా ఉద్యమానికి జడసి ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ప్రాణాలను దక్కించుకునేందుకు సోదరితో కలిసి దేశం వీడారు. ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. హసీనా దేశం వీడిన తర్వాత రాజకీయ అస్థిర పరిస్థితుల మధ్య బంగ్లాదేశ్లో నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ అల్లర్ల నేపథ్యంలో హసీనాపై హత్య సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వీటిపై ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ నేడు తీర్పు వెలువరించనుంది.
Also Read..
Bihar | 20న బీహార్లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం.. హాజరుకానున్న ప్రధాని మోదీ
Bomb Threats | సీఎం స్టాలిన్ సహా పలువురి నివాసాలకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు
Cabinet Meeting | నేడు బీహార్ క్యాబినెట్ చివరి సమావేశం.. గవర్నర్ను కలువనున్న సీఎం నితీశ్